కేసీఆర్ తో ట‌చ్ లో జ‌గ‌న్?

0
285
jagan in touch with kcr

Posted [relativedate]

jagan in touch with kcr
తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చిన‌ప్పుడు … రేణిగుంట ఎయిర్ పోర్టులో ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున అధికారికంగా మంత్రి బొజ్జ‌ల గోపాల కృష్ణారెడ్డి స్వాగ‌తం ప‌లికారు. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది కానీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి కూడా స్వాగ‌తం పలికారు. ఇది కూడా ఓకే గానీ… తిరుమ‌ల‌లోనూ వైసీపీ నేత‌లు కేసీఆర్ ను క‌ల‌వ‌డంపైనే ఇప్పుడు లేని పోని ఊహాగానాలు వ‌స్తున్నాయి. కేసీఆర్ తో జ‌గ‌న్ ట‌చ్ లో ఉన్నారా? అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

తిరుమ‌లకు విచ్చేసిన త‌ర్వాత కేసీఆర్ ఎవ‌రికీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ప‌లువురు నాయ‌కులు ఆయ‌న‌ను క‌లిసేందుకు ఆస‌క్తి చూపినా వారికి అపాయింట్ మెంట్ దొర‌క‌లేదు. కానీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ..మాత్రం తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. ఆయ‌న‌తో కొద్దిసేపు ముచ్చ‌టించారు. ఆ ముచ్చ‌ట్ల వెన‌క మ‌ర్మ‌మేంటి..? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు త‌లెత్తుతున్నాయి.

వైసీపీ నేత‌ల‌తో .. కేసీఆర్ కు జ‌గ‌న్ ఏమైనా రాయ‌బారం పంపారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ మ‌ధ్య అక్ర‌మాస్తుల కేసు మ‌ళ్లీ వేగం పుంజుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో ఆస్తుల‌ను కాపాడుకోవడానికి ఏమైనా త‌న‌పార్టీ నేత‌ల‌తో రాయ‌బారం పంపారా? అన్న పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. అంతేకాదు వైసీపీ నేత‌లు మాట‌ల సంద‌ర్భంలో… కేసీఆర్ ను తిరుప‌తిలో క‌లుద్దామ‌ని ఆహ్వానించార‌ని టాక్. దానికి ఆయ‌న సున్నితంగానే తిర‌స్క‌రించిన‌ట్టు స‌మాచారం. అంటే కేసీఆర్- వైసీపీ నాయ‌కుల మ‌ధ్య ఏదో చ‌ర్చ మాత్రం జ‌రిగింద‌న్న‌వాద‌న మాత్రం బ‌లంగా వినిపిస్తోంది. అది క‌చ్చితంగా జ‌గ‌న్ గురించేన‌ని కూడా గుస‌గుస‌లాడుకుంటున్నారు టీఆర్ఎస్ క్యాడ‌ర్.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు ప్ర‌త్య‌ర్థిపార్టీ అయిన వైసీపీకి… కేసీఆర్ తో ఏం ప‌ని ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌రికొంద‌రైతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు కోసం ఏమైనా చ‌ర్చ‌లు జ‌రిగాయా అన్న అనుమానాల‌ను కూడా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ భేటీలో జ‌గ‌న్ అంశంపై చ‌ర్చించారా..? లేదా పొత్తుల‌పై డిస్క‌స్ చేశారా? అన్న‌ది మాత్రం స‌స్పెన్స్ గా మిగిలింది!!!!

Leave a Reply