ఆ పేరెత్తడానికి జగన్ కి ధైర్యం లేదా?

 Posted November 7, 2016

jagan is afraid of narendra modi
కన్న తండ్రికి కూడా వైసీపీ అధినేత వై.ఎస్ జగన్ భయపడలేదని అయన విమర్శకులు చెప్పే మాట.తండ్రీకొడుకుల గొడవ గురించి అప్పట్లో వై.ఎస్ సతీమణి విజయమ్మ రోశయ్య తో చెప్పుకుని బాధపడినట్టు కూడా వార్తలొచ్చాయి.అంతటి ప్రజాదరణ కలిగిననేత,సొంత తండ్రికే జగన్ భయపడలేదంటే…రాజకీయ దిగ్గజం కాంగ్రెస్ నే ఒంటరిగా డీకొడితే ఇక జగన్ ఎవరికీ భయపడరని అంతా భావించారు.ప్రత్యర్ధులు ఏమన్నా ఆ దూకుడు స్వభావమే జగన్ కి అభిమానుల్ని సంపాదించి పెట్టింది.కానీ జగన్ ఇమేజ్ కి ఆ ఒక్కరు అడ్డుకట్ట వేస్తున్నారు.అయన పేరెత్తడానికి కూడా జగన్ బెంబేలెత్తిపోతున్నారు.ఆయనే ప్రధాని మోడీ.

విశాఖలో వైసీపీ భారీ ఎత్తున నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభ డిమాండ్ ఒక్కటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాబట్టడం.అది వచ్చేదాకా వైసీపీ పోరాటం ఆగదని జగన్ ఘనంగా ప్రకటించారు కూడా .హోదా ఇవ్వాల్సిన కేంద్రం…కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న మోడీని అంతటి భారీ బహిరంగసభలో జగన్ చీల్చి చెండాడాలి కదా! ఇది రాజకీయ పరిజ్ఞానం అంతగా లేని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు.చంద్రబాబు వైఫల్యాలు,మోసాలు అంటూ విశాఖ సభలో హోరెత్తించిన జగన్ …మోడీ పేరెత్తాలంటే మాత్రం భయపడిపోయారు.అసలు హోదా ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిన కేంద్రాన్ని ఏదో మొక్కుబడిగా మాట్లాడి…బాబుని బంతాట ఆదుకున్న జగన్ ని చూసి వైసీపీ కార్యకర్తలు,అయన అభిమానులు సంబరపడిపోవచ్చు.కానీ ఇవ్వాల్సినోళ్ళని వదిలేసి ….ప్రాధేయపడేవాళ్ళని టార్గెట్ చేస్తే ప్రయోజనమేంటో అందరికీ తెలుసు..ఇది పక్కా రాజకీయం …పక్కా రాజకీయ సభ …కాకపోతే జై ఆంధ్ర ప్రదేశ్ పేరు…ప్రత్యేక హోదా ముసుగు…పేరెత్తడానికే భయపడేవాళ్లు మోడీ మీద పోరాటం చేస్తారంటే వినడానికి జనం చెవుల్లో పువ్వులు లేవు …వాళ్ళ మెదడులో మట్టి అంత కన్నా లేదు.

SHARE