పవన్ పొగిడితే జగన్ కి మండుతోందా?

jagan is angry for pawan kalans complements

Posted April 14, 2017

jagan is angry for pawan kalans complements
వినటానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజమట.ఎప్పుడూ లేనిది ఏపీ కి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో బాగానే కష్టపడుతున్నారని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పొగిడిన విషయం తెలిసిందే.అంతటితో ఆగకుండా టీడీపీ,బీజేపీ ఈ విషయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాయని కూడా పవన్ విమర్శించారు.ఈ మధ్య ఏపీ రాజకీయాల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఈ వ్యాఖ్యలు చూడగానే ఆశ్చర్యపోతారు.జనసేన అనేది టీడీపీ 2 గా వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తుంటే ,అయినా ఆ పార్టీ అధినేత తమని పొగుడుతుంటే ఎవరికైనా ఎక్కడలేని కిక్ రావాలి.కానీ వైసీపీ అధినేత జగన్ కి అరికాలి మంట నెత్తికెక్కుతోందట. దానికి కారణం తెలుసుంటే పవన్ వ్యాఖ్యల వెనుక లోగుట్టు అర్ధమవుతుంది.జగన్ ఎందుకు బాధపడుతున్నారో తెలుస్తుంది.

2019 ఎన్నికల చిత్రాన్ని చూసుకుంటే ముక్కోణపు పోటీ తప్పేట్టు లేదు.అధికార టీడీపీ ని ఎదుర్కొనే సత్తా కావాలంటే ముందుగా ఎదుట వున్న ప్రతిపక్షం దెబ్బ తినాలని వైసీపీ,జనసేన కి తెలియంది కాదు.ఆ దృష్టి తోటే ఇప్పటిదాకా ఆ పార్టీలు రాజకీయం చేశాయి.ఈ పార్టీలు ఇప్పటిదాకా పొత్తుల గురించి ఆలోచించలేదు సరికదా కత్తులు నూరుకుంటూ వచ్చాయి.ఇప్పుడు హఠాత్తుగా పవన్ చేసిన ప్రకటన గురించి వైసీపీ,జగన్ కి ఓ డౌట్ ఉందట.”ఇప్పటికే దెబ్బ తింటున్న తమ పార్టీ,ఈడీ కేసులు ముమ్మరమైతే ఇంకాస్త ఇబ్బందుల్లో పడటం ఖాయం.అప్పుడు వైసీపీ శ్రేణులు ప్రత్యామ్న్యాయంగా జనసేన వైపు చూడాలనే పవన్ స్టేట్ మెంట్ ఇచ్చి వుంటారు.తమ బలహీనతని వారి బలంగా మార్చుకునే వ్యూహం ఇందులో వుంది”…ఇలా సాగుతున్న ఆలోచనలతో పవన్ ప్రకటనని జగన్ ఎంజాయ్ చేయలేకపోతున్నారట.కానీ పవన్ అంత లోతుగా ఆలోచించి మాట్లాడతాడా ? ఏమో…పడే వాళ్ళకే బాధ తెలుస్తుంది.బయట ఉండి జగన్ మరీ ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనడం కూడా తప్పేమో!

SHARE