ఘట్టమనేని ఇంట్లో మంటపెట్టిన జగన్…

0
523
jagan kept clashes in ghattamaneni family

Posted [relativedate]

jagan kept clashes in ghattamaneni family
వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి,సూపర్ స్టార్ కృష్ణ మధ్య రాజకీయాలకి అతీతమైన స్నేహసంబంధాలు ఉండేవి.వై.ఎస్ మరణం తర్వాత ఆ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు కొనసాగేవి.పాలిటిక్స్ పరంగా కృష్ణ సైలెంట్ అయిపోయినా ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు, జగన్ కి దగ్గరగా వుంటూ వస్తున్నారు.2014 ఎన్నికలకి ముందు ఘట్టమనేని ఇంటి అల్లుడు గల్లా జయదేవ్ కుటుంబంతో సహా టీడీపీ లో చేరడం తో సమీకరణాల్లో కొంత మార్పు వచ్చింది.గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున నిలబడతాడనుకున్న కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు డ్రాప్ అయ్యారు.దానికి కుటుంబ కారణాలని కొందరు,రాజకీయ కారణాలని ఇంకొందరు చెప్పినా అసలు నిజం ఘట్టమనేని కుటుంబానికే తెలుసు.

ఇంకో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు వస్తాయనగా వైసీపీ లో ఆదిశేషగిరిరావు యాక్టివ్ అయ్యారు.కాదు కాదు …జగన్ అలా డిసైడ్ చేశారు.దీంతో మహామహులైన నేతలు వున్నా ఇటీవల కొన్ని ప్రెస్ మీట్స్ లో ఆదిశేషగిరిరావు ని పక్కన కూర్చోబెట్టుకుని జగన్ షో రన్ చేశారు.అప్పుడే ఏదో జరగబోతోందని తెలుగు బులెట్ అప్పట్లోనే ఓ కధనం ఇచ్చింది.ఇప్పుడు అదే కధనాన్ని నిజం చేస్తూ అమరావతి సమీపంలో వైసీపీ కార్యాలయ నిర్మాణ కార్యక్రమంలో ఆదిశేషగిరిరావు కి పెద్ద పీట వేశారు. గుంటూరు జిల్లాలో చంద్రబాబు సామాజికవర్గం నుంచి గట్టి నేతల అవసరముందని భావించిన జగన్ మహేష్ బాబాయ్ ని బాగా దువ్వుతున్నాడు.అంతవరకు ఏముందిలే అని ఘట్టమనేని ఫ్యామిలీ చూస్తూ ఊరుకుంది.కానీ అక్కడే జగన్ ని తక్కువ అంచనా వేసింది.

2019 సార్వత్రిక ఎన్నికల బరిలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఆదిశేషగిరిరావు ని నిలబెట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట.అదే జరిగితే ఘట్టమనేని ఫ్యామిలీలో మంట పుట్టినట్టే.టీడీపీ తరపున బావ జయదేవ్,వైసీపీ తరపున బాబాయ్ ఆదిశేషగిరిరావు బరిలో నిలిస్తే ఒక్క మహేష్ పరిస్థితి మాత్రమే కాదు ,మొత్తం ఘట్టమనేని ఫ్యామిలీ పరిస్థితి ఏమిటో ఆలోచిస్తే భయమేస్తుంది.తోడబుట్టిన తమ్ముడు,పిల్లనిచ్చిన అల్లుడు లో ఎవరో ఒకరిని తేల్చుకోమంటే కృష్ణకైనా,ఇంకెవరికైనా కష్టమే.జగన్ పెట్టిన ఈ మంట నుంచి ,ఈ సందిగ్ధ పరిస్థితి నుంచి ఘట్టమనేని ఫ్యామిలీ ఎలా బయటపడుతుందో చూడాలి.ఈసారి ఇటు ఆదిశేషగిరిరావు,అటు జయదేవ్ స్పీడ్ చూస్తుంటే అదంతా తేలిక అనిపించడం లేదు.

Leave a Reply