అబ్బ…ఛా…జగన్ కి సాక్షికి సంబంధం లేదా?

Posted April 7, 2017

jagan layers files produced to cbi court
సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారంటూ వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు చేయమంటూ సిబిఐ దాఖలు చేసిన పిటీషన్ మీద నేడు విచారణ జరిగింది.ఆ విచారణలో జగన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు.అందులో సాక్షిలో ప్రసారమైన మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ కి తనకు ఏ సంబంధం లేదని ఆ కౌంటర్ లో జగన్ సిబిఐ కోర్టుకి విన్నవించుకున్నారు. పైగా ఆ ఇంటర్వ్యూ లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మాత్రమే రమాకాంత్ రెడ్డి జవాబు ఇచ్చారని ఆ కౌంటర్ లో జగన్ వివరణ ఇచ్చారు.

జగన్ దాఖలు చేసిన కౌంటర్ లో రెండు విషయాలు మరీ దారుణం.

1 … సాక్షిలో ప్రసారమయ్యే ఇంటర్వ్యూ కి జగన్ కి ఏ సంబంధం లేదా ?
2 …జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రమాకాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారా? అయితే ఆ జర్నలిస్ట్ కి జీతం ఇచ్చేది ఎవరు? మీరు కాదా ?
3 ..మీరు ఇప్పుడు చెబుతున్న జర్నలిస్ట్ కొన్ని నెలల కిందటే మీరు సగౌరవంగా తనని పిలిచినట్టు చెప్పుకున్నారు.కావాలంటే ఏ యు ట్యూబ్ లో చూసినా ఆ జర్నలిస్ట్ ఏమి చెప్పాడో అర్ధం అవుతుంది.

SHARE