ఫీజ్ కట్టి పాఠం వింటున్న జగన్..

Posted December 25, 2016

jagan listening class by payinh fee,jagan,prashanth kishore,jagan listening to prashanth kishore,jagan and prashanth kishore
వైసీపీ అధినేత జగన్ వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా …ఆయనకి దగ్గరగా మసిలిన వాళ్ళు ఎవరైనా..ఈ మధ్య కాలంలో ఆయన్ను కలవడానికి వెళితే ఓ స్వీట్ షాక్ తో బయటికి వస్తున్నారంట. వాళ్ళని అంతగా ఆశ్చర్యపరుస్తోంది స్వయంగా జగన్ వ్యవహారశైలి. ఇంతకు ముందు అంటీముట్టనట్టుగా వుండే జగన్ ఇంతగా మారిపోయారేంటబ్బా అనుకుంటూ బయటికి వస్తున్న వాళ్లకి ఓ డౌట్ వస్తోంది.జగన్ ని ఇంతగా మార్చింది ఎవరబ్బా అని?ప్రశ్న అంత తేలిగ్గాదు జవాబు. ఈ మార్పు కోసం భారీగా ఖర్చుపెట్టారు జగన్.డబ్బుతో మార్పు వస్తుందా ఎక్కడైనా అనుకుంటున్నారా? నిజమే డబ్బుతో మార్పు రాదు గానీ ఫీజ్ గా డబ్బు తీసుకున్న వాళ్ళు పాఠం చెబితే వింటారుగా? పైగా ఈసారి పరీక్ష తప్పితే ఇక భవిష్యత్ ఉండదని తెలిస్తే ఆ జాగ్రత్త వేరు.జగన్ విషయంలో అదే జరిగింది..అదెలాగంటే ..

2019 ఎన్నికల కోసం భారీగా ఫీజ్ ఇచ్చి మరీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలని వినియోగియించుకోడానికి వైసీపీ డిసైడ్ అయిపోయింది.ప్రశాంత్ టీం తొలి చూపు జగన్ మీదే పడిందట.అయన శారీరక భాష,పలకరింపు,నవ్వు,మాట్లాడ్డం ఇలాంటి వాటిలో లోపాలు ఎత్తిచూపి తొలుత వాటిని సవరించుకోవాలని చెప్పిందట.వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరించడం మీద స్పెషల్ సెషన్ నిర్వహించారట.అది బాగా పనిచేసిందని జగన్ టీం సంబరపడుతోందట.అయితే ఈ విషయం మీద ఇంతకు ముందు ఎన్నో సార్లు చెప్పి అలిసిపోయిన సీనియర్ నేతలు మాత్రం …మా మాట అప్పుడే వింటే ఫీజ్ కట్టి మరీ పాఠాలు నేర్చుకునే బాధ తప్పేదని సరదాగా అనుకుంటున్నారు. బాబు సీనియర్లు …ఓ మాట మీకు తెలియదా ? శంఖం లో పోస్తేనే కదా తీర్ధం అయ్యేది.

SHARE