ఆ ఇంటి పోరుపై జగన్ నోరు పెగలదా?

 Posted October 31, 2016

jagan maintais silence on the family issue
బావమరిది బతక కోరతాడు ..దాయాదులు చావు కోరతారు అన్నది పాత నానుడి . కానీ వైసీపీ అధినేత జగన్ ఇంటిమనుషుల్లాంటి వాళ్ళ వ్యవహారంలో ఈ నానుడి పనిచేయడం లేదు .ఎవరికి వారే యమునా తీరే టైపు పరిస్థితి ఆ బావాబావమరుదుల మధ్య నడుస్తోంది .దీనివల్ల కుటుంబ బాంధవ్యాల మాటేమో గానీ ప్రకాశం జిల్లాలో వైసీపీకి ముప్పు తెస్తోంది .ఆ బావ,బావమరుదులు మరెవరో కాదు …ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డి ,అయన బావమరిది బాలినేని శ్రీనివాసరెడ్డి .ఒకాయన ఎంపీగా గెలిస్తే …ఇంకొకాయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు …అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది .అసలు కారణం బయటికి రాకుండా ఇద్దరు బాగానే మేనేజ్ చేస్తున్నారు .అయితే పార్టీ కోసం పని చేసే విషయంలో ఒకరిమొహం ఇంకోరు చూస్తున్న పరిస్థితి లేదు .

ఒకానొక దశలో బాలినేని పార్టీ మారతాడని వార్తలు కూడా వచ్చాయి.ఆయనకి జగన్ నచ్చజెప్పి జిల్లా పార్టీ బాధ్యతలు అప్పజెప్పారు .కానీ బాబాయ్ సుబ్బారెడ్డి ని ,అయన బావమరిది శ్రీనివాసరెడ్డి ని ఒక్క చోట కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నారు.ఇప్పటికే జిల్లా నుంచి ఎమ్మెల్యేలు భారీగా వలస వెళ్లారు .ఉన్న క్యాడర్ కి ఉత్సాహం తెప్పించాల్సిన వాళ్ళు ఎడమొహం పెడమొహం గా వుంటున్నారు.2019 ఎన్నికలకి సర్వశక్తులు కూడగట్టుకుంటున్న జగన్ ఆ ఇంటి కుంపటిపై మౌనమే నా భాష అంటున్నారు .పరిస్థితి ఇలాగే కొనసాగితే ….జగన్ గొంతు పెగలకపోతే వైసీపీ కి నష్టం తప్పదు .

SHARE