Posted [relativedate]
వైసీపీ అధినేత జగన్ ఈదఫా ఢిల్లీ టూర్ లో ప్రధాన అంశం వైసీపీ తరపున గెలిచిన వాళ్ళని బాబు తన మంత్రివర్గంలోకి తీసుకోవడం.రాష్ట్రపతికి దీనిపై జగన్ ఫిర్యాదు చేయడం సహజం.కానీ ఆ రాష్ట్రపతి భవన్ నుంచి బయటికి వచ్చాక జగన్ మాట్లాడిన మాటలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ టూర్ లోగుట్టు అర్ధం అవుతుంది.జుంపింగ్ జిలానీల గురించి ఫిర్యాదు కోసం ఢిల్లీ వచ్చారు సరే,ఇక్కడ లోక్ సభ లో కూడా పార్టీ మారిన ఎంపీ ల వ్యవహారాన్ని స్పీకర్ ఎటూ తేల్చడం లేదని ఓ జర్నలిస్ట్ ప్రస్తావించినప్పుడు జగన్ ఒక్క మాట కూడా బీజేపీ ని అనలేదు.పైగా అక్కడా,ఇక్కడా అలాగే పెండింగ్ వున్నాయంటూ పెద్దగా నవ్వేశారు.సరే ఆ విషయాన్ని అంతటితో వదిలేద్దామనుకుంటే అంతకుమించిన కామెంట్ జగన్ లోగుట్టుని అడ్డంగా బయటపెట్టింది.
క్యాబినెట్ లోకి వైసీపీ ఎమ్మెల్యేల్ని తీసుకోకుండా బాబుని ఎవరు నియంత్రించగలరన్న విషయానికి జగన్ భలే సమాధానం ఇచ్చారు.బీజేపీ లో ఆ పార్టీ నిర్ణయాల్ని ప్రభావితం చేయగల కొందరు వున్నారు.వారిని ఒప్పించగలిగితే బాబుకి మొట్టికాయలు వేస్తారు అని జగన్ సంబరపడిపోతూ చెప్పారు.అంటే బీజేపీ నిర్ణయాల్ని ప్రభావితం చేయగలిగే వారితో చెప్పి బాబుకి మొట్టికాయలు వేయించగలిగే చనువు వారితో జగన్ కి ఉందా ? బీజేపీ లో వైసీపీ ని కలిపేసేందుకు చర్చలు సాగుతున్న మాట నిజమేనా ? ఈ ప్రశ్నలకి జవాబు వెదుక్కుంటే కేసుల గోల నుంచి తప్పించమని జగన్ బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడుతున్న మాట నిజమేనని అర్ధమవుతుంది.బీజేపీ అందుకు ఒప్పుకుంటుందో..లేదో తర్వాత విషయం గానీ జగన్ దేబిరింత లో మాత్రం నిజమున్నట్టుంది.