Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సీఎం చంద్రబాబు నోట ముందస్తు ఎన్నికల మాట రాగానే వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయిపోయారు.అయన వెంటనే కలిసిన వాళ్లలో ముఖ్యులు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బీహార్ లో మహాకూటమి ఏర్పాటు తో బీజేపీ కి షాక్ ఇచ్చిన ప్రశాంత్ ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. ఆపై ఒక్క ఎన్నికల్లో కూడా బీజేపీ ని ఓడించలేకపోయాడు.కనీసం సమీప భవిష్యత్ లోనూ ఏ రాష్ట్రంలోనూ తాను అంటకాగుతున్న కాంగ్రెస్ పరిస్థితి బాగుందని కూడా అనిపించలేకపోతున్నాడు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా,రాహుల్ తురుపు ముక్కగా ప్రశాంత్ అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఓటమితో పాటు పార్టీ లో లేనిపోని గొడవలు ప్రశాంత్ వల్లే వచ్చాయని కాంగ్రెస్ శ్రేణులే ఆడిపోసుకుంటున్నాయి.అయినా అటు రాహుల్,ఇటు జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ప్రశాంత్ ని నమ్ముకోక తప్పనిసరి పరిస్థితి.అందుకు “లోకల్”అనే ఓ అస్త్రమే కారణం.బిహారీ అయిన ప్రశాంత్ ఎక్కడ లోకల్ అనే కదా మీ డౌట్ ?
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రస్థానం ప్రారంబించింది గుజరాత్ లో.అప్పటిదాకా ఓ సామాజిక కార్యకర్తగా వున్న అయన అక్కడ నుంచి మోడీ,అమిత్ షా ద్వయానికి అండగా ఎన్నికల వ్యూహకర్తగా బరిలోకి దిగారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున జాతీయ స్థాయిలో తన సేవలు అందించారు.యూపీలో ఓటమిపాలైన గుజరాత్ సమీకరణాలతో బాగా పట్టున్న ప్రశాంత్ అక్కడ పదునైన వ్యూహాలు రచించగలరని రాహుల్ నమ్ముతున్నాడు.అదే ఫార్ములాని నమ్ముకుంటున్నాడు వైసీపీ అధినేత జగన్.ఒకప్పుడు సామాజిక కార్యకర్తగా ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ వల్ల మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నాడు.అందుకే ఎన్నికల గురించి ప్రస్తావన రాగానే ముందుగా ప్రశాంత్ నే కలిసాడు.ఈ కలయిక హిట్ అవుతుందో లేక నిరాశ పరుస్తుందో కాలమే తేలుస్తుంది.ఈసారైనా గెలిస్తేనే జగన్ కి “ప్రశాంత్”త.