జగన్ ఆ బీజేపీ నేతను ఆశ్రయించారా.?

122

 jagan meets that bjp politician
అవినీతి,అక్రమాస్తుల కేసుల్లో నిండా మునిగిన వైసీపీ అధినేత జగన్ ని ఎవరు కాపాడుతారు?అయన ఇందుకోసం ఎవర్ని ఆశ్రయించారు? కేంద్రప్రభుత్వం దగ్గర జగన్ ని సమర్ధించడానికి ఎవరు ముందుకొస్తారు?ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం ఆయనట.అయన మరెవరో కాదు కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్ప అని తెలుస్తోంది. కొన్నాళ్లుగా వైసీపీ,జగన్ కి బాగా దగ్గరగా ఉన్నవాళ్లే గుసగుసలాడుకుంటున్నారట ..

ఇందులో నిజానిజాలెలా వున్నా తాజాగా బయటకొచ్చిన ఓ ఫోటో ఈ సందేహాన్ని బలపరుస్తోంది.ఈ ఫొటోలో అన్ని విషయాల్లో జగన్ కి కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డి ,యెడ్యూరప్ప తో కలిసి వున్నారు.చూస్తుంటే ఇద్దరూ ఓ రెస్టారెంట్ లో కలిసినట్టుగా వుంది .ఈ ఫోటో జగన్ తాజా గా జరిపిన రిషికేష్ లేదా డెహ్రాడున్ పర్యటన సందర్భంగా తీసింది అయ్యే అవకాశాలున్నాయి .

2018 కర్ణాటక ఎన్నికల్లోబీజేపీ సీఎం అభ్యర్థిగా వున్నా యెడ్యూరప్ప నిజంగా అంత రిస్క్ తీసుకుంటారా?.ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే అందుకు కొల్లలుగా ఉదాహరణలున్నాయి.గాలి అండ్ కో సాయంతో కర్ణాటకలో జగన్ పరివారం ఎంతగా చెలరేగిపోయిందో …యెడ్యూరప్ప వారికెంత అండగా నిలబడ్డారో అందరికీ తెలిసిందే.అయితే జగన్ ని ఇప్పుడు వెన్నాడుతున్న అవినీతి భూతం తో పాటు సొంత పార్టీలో తిరుగుబాట్లు ఎడ్డీ కొంపముంచాయి.ఆయన హైకమాండ్ పై యుద్ధం చేసి అటుఇటు తిరిగి చివరకు సొంత గూటికే చేరుకున్నారు.అతి కష్టం మీద మళ్లీ కర్ణాటక కమలం బాధ్యతలు చేపట్టగలిగారు.అయితే అయన కోర్ టీమ్ లో అప్పటి తిరుగుబాటుకు కారణమైన శోభా పేరును అమిత్ షా నిర్మొహమాటంగా తొలగించారు .పైగా పెద్దాయన్ని హెచ్చరించారట కూడా .ఇదంతా జరిగి కొన్నాళ్లే .ఇంతలో విజయసాయిరెడ్డి తో వున్నఎడ్డీ ఫోటోలు బయటకు వచ్చాయి.

ఇప్పుడు నిజంగా జగన్ ని వెనుకేసుకొచ్చే పరిస్థితి ఎడ్డీ కి లేదు.జగన్ మీద సానుభూతి వున్నా అయన హైకమాండ్ దాకా వెళ్లే సీన్ అంతకన్నా లేదు.ఎదురు తిరిగినా ,ఇష్టమొచ్చినట్టు చేసినా ఊరుకోడానికి పార్టీని నడిపిస్తున్నది అద్వానీ కాదు ..మోడీ ,అమిత్ షా ..ఈ విషయం గుర్తుంచుకుంటే ఎడ్డీ అంత సాహసం చేయరు.కానీ వైసీపీ వర్గాలు రాబోయే ఎన్నికల దాకా కేసుల ప్రభావం మీద పడకుండా చూసుకోడానికి అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు.తెలిసిన అందర్నీ ఆశ్రయిస్తున్నాయి .ఆ ప్రయత్నాలు ,పూజలు ఫలిస్తాయో లేదో కాలమే చెప్పాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here