మాట తప్పుతాడు..మడమ తిప్పుతాడు

0
592
jagan mohan reddy stood on his words

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

jagan mohan reddy stood on his words
వైసీపీ అధినేత జగన్ పదేపదే విశ్వసనీయత అనే అంశాన్ని ముందుకు తెచ్చి సీఎం చంద్రబాబుని ఏకిపారేయడం తెలుగు ప్రజలకు బాగా అలవాటైన విషయం.మాట తప్పీ తప్పీ బాబుకి తుప్పు పడితే తాను మాత్రం నిప్పు అనుకుంటూ చెప్పుకోవడం జగన్ కి సర్వసాధారణ అంశం.ఈ రెండు విషయాల్లో జగన్ కి ఇక మైలేజ్ ఇకపై ఉండకపోవచ్చు.ఎందుకంటే ఏపీ అభివృద్ధి ప్రత్యేక హోదా తో ముడిపడి ఉందని,దాని కోసం ఎంతకైనా పోరాడతానని జగన్ యువభేరి పేరిట రాష్ట్రమంతా తిరిగి చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటూనే వున్నాయి.అందుకోసం ఈ జూన్ తర్వాత వైసీపీ ఎంపీ లతో రాజీనామా చేయిస్తానని ప్రకటించారు జగన్.

అయితే మాట తప్పను ..మడమ తిప్పను అనే డైలాగు పక్కనబెట్టి ఎంపీ ల రాజీనామా విషయంలో జగన్ యూ టర్న్ తీసుకున్నాడు.ఎంపీ ల రాజీనామా ఎప్పుడు అని అడుగుతుంటే వైసీపీ ఈ విషయంలో తొందరపడితే పార్లమెంట్ లో ఏపీ కి ప్రత్యేక హోదా కోసం పోరాడే నాయకులు ఎవరుంటారని మనల్నే ఎదురు ప్రశ్నిస్తున్నాడు? ఇంతలో ఎంత మార్పు.ఈ విషయం నాడు ప్రకటన చేసేటప్పుడు ఎందుకు గుర్తు లేదో ? పైగా కళ్ళు మూసుకుని పాలు తాగిన పిల్లి చందంగా జగన్ ఎన్ని చెబుతున్నా ఈ మార్పంతా ఢిల్లీలో మోడీని కలిసాక అని జనానికి బాగానే అర్ధం అవుతోంది. జగన్ ని ఇన్నాళ్లు హీరోగా చూసిన ఆయన వీరాభిమానులు,వైసీపీ కి ఆది నుంచి దన్నుగా నిలుస్తున్న మైనారిటీ,ఎస్సీ నేతలు ఒకే మాట అంటున్నారు …”జగన్ కూడా మాట తప్పుతాడు.మడమ తిప్పుతాడు “అని.

Leave a Reply