రోడ్డు మీద జగన్ ..చుట్టూ గన్ మెన్లు

 Posted October 26, 2016

jagan narrowly escapes a road accident
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.అయితే ఓ 20 నిమిషాలపాటు నడిరోడ్డు మీద గన్ మెన్ల రక్షణలో ఉండాల్సి వచ్చింది. యువభేరి ముగించుకుని కర్నూల్ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరారు జగన్ .రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాల్మాకుల వద్ద జగన్ ప్రయాణిస్తున్న కార్ టైర్ పంక్చర్ అయ్యింది.దీంతో వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కకి లాగేసింది.అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారుని ఆపగలిగాడు.కారు దిగిన జగన్ కి గన్ మెన్లు రక్షణగా నిలిచారు.టైర్ మార్చడానికి 20 నిమిషాలు పట్టింది.అంతసేపు జగన్ ని చూసిన ప్రయాణికులు ఎవరూ దగ్గరికి రాకుండా భద్రతా సిబ్బంది జాగ్రత్తపడ్డారు.

SHARE