Posted [relativedate]
వైసీపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇరు పార్టీల అధినేతలు జగన్, పవన్ కల్యాణ్ భేటీ కాబోతున్నారని లీకులు వచ్చాయి. ఇక పొత్తు లాంఛనమేనని కూడా వైసీపీ శ్రేణులు భావించాయి. కానీ అందులో వాస్తవం లేదన్న ఊహాగానాలు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి తరపున పవన్ ప్రచారం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే యుద్ధం చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా సరిగ్గా ఇదే పాయింట్ ను లేవనెత్తారు. అధికారపక్షం హామీలు నెరవేర్చకుండా డ్రామాలాడితే… పవన్ ఏం చేశారని ప్రశ్నించారు. రోజా వెంట ఈ మాటలు రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ పై జగన్ అభిప్రాయమే.. రోజా నోటి వెంట వచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పవన్- జగన్ మధ్య పొత్తుకు అవకాశం లేదన్నది రోజా వ్యాఖ్యలతో తేలిపోయిందంటున్నాయి వైసీపీ శ్రేణులు. పొత్తు అవకాశాలే ఉంటే … రోజా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడే ఛాన్స్ లేదు. కాబట్టి పవన్ ను వైసీపీ పూర్తిగా పక్కనబెట్టేసినట్టేనని ప్రచారం జరుగుతోంది. ఇక ఇద్దరి మధ్య దోస్తీకి అవకాశమే లేదన్న వాదన వినిపిస్తోంది.
పవన్ దూరం చేసుకోవడం వైసీపీకే ఎక్కువ నష్టమంటున్నారు విశ్లేషకులు. 2014 లో లాగా… పవన్ కల్యాణ్ 2019లోనూ జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయాలన్నీ వైసీపీకి అర్థం అవుతాయో? లేదో?