షా కి జగన్ జీ హుజూర్?

0
606
jagan no comments on amit shah words

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

jagan no comments on amit shah words
ఉత్తరాదిన ప్రధాని మోడీ,అమిత్ షా ద్వయం హవా నడుస్తోంది.ఇటు దక్షిణాదిలో పరిస్థితి భిన్నం .ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇంకా భిన్నం.రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ మీద ఎంత కోపముందో ప్రత్యేక హోదా సహా ఎన్నో విభజన హామీల్ని తుంగలో తొక్కిన కమలనాధులన్నా అంతే కోపముంది.అయితే పిల్లి మెడలో గంట ఎవడు కడతాడన్న చందంగా ప్రధాన రాజకీయ పక్షాలేవీ ముందుకు రాకపోవడంతో బీజేపీ కి పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు.ఇక కాంగ్రెస్,జనసేన,వామ పక్షాలు అక్కడక్కడా అమిత్ షా కి వ్యతిరేకంగా గొంతెత్తినా వాటి బలం సరిపోవడం లేదు.ఇక విభజన హామీల్ని కేసుల కోసం సీఎం చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టాడని ఆరోపించిన జగన్ అమిత్ షా టూర్ సందర్భంగా నోరెత్తింది లేదు.లక్షా 75 వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని షా చెబుతుంటే ఎక్కడా అని నిలదీయాల్సిన జగన్ గొంతు పెగల్లేదు.

మిత్రపక్షమనో,ఇంకోటనో చంద్రబాబు అమిత్ షా టూర్ మీద మౌనం వహించారంటే అర్ధం వుంది.అప్పటికీ ఆయన ఓ విందు భేటీ ఏర్పాటు చేసి సామరస్యంగా అయినా విభజన హామీలు నెరవేర్చకపోతే కష్టమని అమిత్ షా కి వివరించారు.కానీ విపక్ష నేతగా ఆ విషయాల్లో డిమాండ్ చేయాల్సిన జగన్ షా పర్యటన సందర్భంగా ఎక్కడ దాక్కున్నారో తెలియదు.సరే ఆయన మాట్లాడకపోయినా కనీసం పార్టీ నేతలతో ప్రకటనలు ఇప్పునుంచవచ్చు.లేదా పార్టీ శ్రేణులతో నిరసన కార్యక్రమాలు చేయొచ్చు.కనీసం సాక్షిలో అమిత్ షా చెప్పింది అబద్ధం అన్న కధనం అయినా రాయించవచ్చు .ఇవేమీ లేకుండా అమిత్ షా కి జీ హుజూర్ అని చెప్పేందుకు జగన్ ఈ టూర్ ని వాడుకున్నారు.ప్రతిపక్ష నేతగా ఉండి జగన్ ఇలా వ్యవహరించడం వైసీపీ శ్రేణులకు నచ్చడం లేదు. ఇప్పుడు జనానికి కూడా స్పష్టంగా అర్ధం అవుతోంది.కేసుల కోసం కేంద్రానికి,బీజేపీ కి జగన్ ఎంతగా సాగిలాడుతున్నారో?

Leave a Reply