ఆ పెళ్ళికి జగన్ డుమ్మా …రిసెప్షన్ కైనా?

Posted November 17, 2016

jagan not attend gali janardhan reddy daughter wedding
గాలి,జగన్…..ఒకప్పుడు అన్నదమ్ములుగా మసిలిన ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి బంధముంది? గాలి ఇంటి పెళ్ళికి జగన్ వెళతారా అన్న సందేహాలకు తెర పడింది. టీడీపీ సహా అదను కోసం కాచుకు కూర్చున్న వారికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు అయన గాలి ఇంటి పెళ్ళికి డుమ్మా కొట్టేశారు. ఫోన్ ద్వారా విషయం,శుభాకాంక్షలు చెప్పేసి తన తరపున భూమనని పెళ్ళికి పంపినట్టు తెలుస్తోంది.కొద్దిగా బాధపడ్డ గాలి కూడా జగన్ పరిస్థితిని అర్ధం చేసుకున్నారట. అయితే అక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోలేదు.

గాలి కుమార్తె పెళ్ళికి సంబంధించి ఈ నెల 20 న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.దీంతో కనీసం ఈ రిసెప్షన్ కైనా జగన్ వస్తారా అని మళ్లీ చర్చ మొదలైంది. వెళితే ఓ కష్టం …వెళ్లకుంటే ఇంకో కష్టం..పాపం జగన్ కి గాలి ఇంటి పెళ్లి కూడా చిక్కే తెచ్చిపెట్టింది. చూడాలి …గాలికి విలువిచ్చి రిసెప్షన్ కైనా జగన్ వెళతారో …లేక రాజకీయానికి విలువిచ్చి డుమ్మా కొడతారో?

SHARE