రెడ్లను పట్టించుకోని జగన్?

0
275
jagan not interested in reddys

Posted [relativedate]

jagan not interested in reddys
ఏపీలో వైసీపీ అధినేత జగన్ ను రెడ్ల ప్రతినిధిగా చెబుతుంటారు. ఎందుకంటే స్వతహాగా రెడ్డి సామాజిక వర్గం వ్యక్తే కావడంతో జగన్ పై ఆ ముద్ర ఉంది. ఈ రెడ్డి స్టాంప్ వల్లే ఆయన ఇతర సామాజిక వర్గాలకు దూరమవుతున్నారన్న వాదన కూడా ఉంది. ఆయన పార్టీలో రెడ్డి నాయకులు ఎక్కువ కావడమే ఇందుకు కారణం.

వైఎస్ తో ఉన్న సాన్నిహిత్యం, కాంగ్రెస్ పరిస్థితి బాగా లేకపోవడం వంటి కారణాలతో జగన్ దగ్గరకు చాలామంది రెడ్డి నాయకులు చేరారు. మొదట్లో బాగానే ఉన్నా రెడ్డి నాయకులు ఎక్కువ కావడంతో.. ఇక జగన్ వారిని లైట్ తీసుకుంటున్నారట. వారి వయస్సుకు కూడా గౌరవమివ్వకుండా మాట్లాడుతున్నారని టాక్. ఇటీవల టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

జేసీ మాటల్లో చెప్పాలంటే రాయలసీమలో కులపిచ్చి ఎక్కువ అట. మావాడంటూ రెడ్లంతా జగన్ వెనక వెళ్తున్నారు. కానీ అక్కడ ఏమీ లేదని వెనక్కి వచ్చేశారు. అంటే దీనర్థం రెడ్డి నాయకులంతా వెనక్కు వెళ్లిపోతున్నారని జేసీ స్పష్టం చేశారు.

వైసీపీలోని రెడ్డి నాయకులు కూడా జేసీ మాటలు నిజమేనంటున్నారట. మరో ఆప్షన్ లేకనే జగన్ పార్టీలో ఉండాల్సి వస్తుందని వాపోతున్నారట. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని ఆవేదన చెందుతున్నారని టాక్. ఏదేమైనా సీమలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న రెడ్లను జగన్ ఎందుకు పక్కన బెడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.

Leave a Reply