ఓదార్పు యాత్రకు జగన్ దూరం …

0
407
jagan not react on andhrajyothi fire accident

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

jagan not react on andhrajyothi fire accident
” ఓదార్పు యాత్ర “…ఈ మాట మీద నిజంగా హక్కు ఎవరికైనా ఉందంటే అది కచ్చితంగా వైసీపీ అధినేత జగన్ కే వుంది.ఈ విషయంలో చంద్రబాబైనా ఇంకెవరైనా కనీసం వాదించే అవకాశం కూడా లేదు.ఓదార్పు యాత్ర మీద ఇంతటి పట్టున్న జగన్ మాత్రం ఓ ఓదార్పు యాత్రకి దూరంగా వుంటున్నారు.దాని వెనుక పెద్ద రహస్యం ఏమీ లేదు.మేటర్ అందరికీ తెలిసిందే.కాకుంటే ఓదార్పు అన్నాక కూడా జగన్ స్పందించకపోవడం కాస్త ఆశ్చర్యకరం.

హైదరాబాద్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలోజరిగిన అగ్నిప్రమాదం గురించి అందరికీ తెలుసు. దిన పత్రిక,టీవీ ఛానల్,యు ట్యూబ్ ఛానల్ …ఈ మూడు వున్న మీడియా సంస్థలో ప్రమాదం జరిగితే ఖద్దరు చొక్కాలు చూస్తూ వూరుకుంటాయా? టపీమని అక్కడ వాలిపోయాయి.తెలంగాణ సీఎం కెసిఆర్ అయితే పాత వైరాన్ని మరిచి స్నేహాన్ని గుర్తుంచుకుని ABN రాధాకృష్ణకు ఫోన్ చేసి ప్రమాదం గురించి ఆరా తీశారు.ఇక మిగిలిన పార్టీ నాయకులైతే ప్రమాద స్థలికి వెళ్లి రాధాకృష్ణతో మాట్లాడి పరామర్శించి,ఓదార్చి తమ అటెండన్స్ గట్టిగా రిజిస్టర్ అయ్యేలా చూసుకున్నారు.ఇంత జరుగుతున్నా ఓదార్పు మీద పేటెంట్ రైట్స్ తీసుకున్న వైసీపీ అధినేత జగన్ మాత్రం అటు కన్నెత్తి చూడలేదు.దీనికి కారణం చెప్పడమంటే దాహమేసినందుకు నీళ్లు తాగారని చెప్పినట్టు ఉంటుంది.

Leave a Reply