Posted [relativedate]
ఏపీలో ముందస్తు ఎన్నికలొస్తాయని జగన్ గట్టిగానే నమ్ముతున్నారా? అంటే ఔననే ఉంటున్నాయి వైసీపీ వర్గాలు. అయితే ఆ ఎన్నికలను తట్టుకునే కెపాసిటీ మనకు ఉందా? లేదా? అన్నదే ఇప్పుడు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే మాత్రం జగన్ కు కష్టం కాలం తప్పకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.
ఏపీలో ప్రస్తుతం టీడీపీకి దీటైన పార్టీ వైసీపీ అయినప్పటికీ … ఆపార్టీ పరిస్థితి ఏం బాలేదు. ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది జారిపోయారు. రేపో మాపో ఎంపీలు కూడా సైకిలెక్కేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలొస్తే పార్టీ ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా బాబుకు జై కొడతారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలామంది వైసీపీ నాయకులు ఇప్పటికే టీడీపీ పెద్దలతో టచ్ లో ఉన్నారట. ఏదో నామ్ కే వాస్తే గా మాత్రమే జగన్ వెంట ఉంటున్నారట. సరైన సమయంలో వారంతా టీడీపీని చూసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఎలాగూ జంపింగ్ జపాంగ్స్ ఉన్నారని జగన్ కు కూడా తెలుసట. కానీ ఏం చేయలేని పరిస్థితి. గట్టిగా మాట్లాడితే అసలుకే మోసం వస్తుంది.
వైసీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కఠిన పరీక్షలను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ముందస్తు ఎన్నికలొస్తాయని జగనే పార్టీలో చెబుతున్నారు. కానీ ముందస్తు ఎన్నికలొస్తే తట్టుకునే కెపాసిటీ లేదని మాత్రం ఆయన మరిచిపోతున్నారని … వైసీపీ వర్గాలే వాపోతున్నాయట.