జగన్ ఆయుధం కత్తి కాదు కలం ..

Posted [relativedate]

jagan open letter to chandrababu about jobsవైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ….ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ కి కేరాఫ్ అడ్రస్.ఆయన ప్రత్యర్థుల మీద మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు మీద నాలుకని కత్తిలా వాడేస్తారు.దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఓ సీఎం ని చెప్పుతో కొట్టమని పిలుపిచ్చిన ప్రతిపక్ష నేత ఆయన.ఈ దూకుడు వల్ల వైసీపీ శ్రేణులు ,ఆయన అభిమానులలో జగన్ కి హీరో ఇమేజ్ వస్తున్నా ..సామాన్య ప్రజానీకం ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల నుంచి ఎంతోకొంత వ్యతిరేకత వస్తోంది.ఈ విషయం ఆయన గుర్తించాడో …ఆయన శ్రేయోభిలాషులు గమనించారో గానీ …ట్రాక్ మార్చుకోవాలని నిర్ణయించినట్టు వుంది.ఇకపై చంద్రబాబు సర్కార్ వైఫల్యాలపై వరుసగా లేఖాస్త్రాలు సంధించాలని జగన్ డిసైడ్ అయిపోయారు..ఈ తరహా పద్దతులకి సీనియర్ నాయకులు హరిరామ జోగయ్య,ముద్రగడ పద్మనాభం పెట్టింది పేరు.హరిరామజోగయ్య అప్పట్లో వరస లేఖలతో వై.ఎస్ ని ఠారెత్తిస్తే …ఇప్పటికీ ముద్రగడ బాబుని ఓ ఆటాడేసుకుంటున్నారు.ఇప్పుడు జగన్ సైతం అదే రూట్ లోకి వస్తున్నారు.అందులో భాగంగా తొలుత నిరుద్యోగ సమస్యని ప్రస్తావిస్తూ బాబుకి  జగన్ లేఖాస్త్రం గురిపెట్టారు.ఇదంతా చూస్తుంటే జగన్ ఆయుధం కత్తి నుంచి కలం అయినట్టు అనిపించడంలేదా? జగన్ సంధించిన ఆ లేఖాస్త్రాన్ని మీరు కూడా చదివెయ్యండి…jagan open letter to chandrababu about jobs

jagan open letter to chandrababu about jobs

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here