జగన్ కి పోటీ వస్తున్న వైసీపీ నేత ..

0
678
jagan opponent ysrcp leader biyyam madhusudhan reddy

 Posted [relativedate]

jagan opponent ysrcp leader biyyam madhusudhan reddy
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నది ఓ పాత నానుడి. ఇప్పుడేమోగానీ ఓ రెండునెలల కిందటిదాకా చంద్రబాబు అధికారంలో ఉంటే వానలు పడవని…అప్పుడు వై.ఎస్,ఇప్పుడు జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సుభిక్షంగా వర్షాలు కురుస్తాయని ఓ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు వైసీపీ తెగ కష్టపడేది. గతంలో జగన్ పల్నాడు ప్రాంతానికి వెళ్ళినపుడు వర్షం పడితే అది అయన పాద మహిమగా చూపిస్తూ సాక్షిలో కధనాలు వండివార్చేశారు. ఇదంతా చూసి స్ఫూర్తి పొందాడో ఏమో గానీ అదే బాటలో నడుస్తున్నాడు ఓ వైసీపీ నేత .అయన గారి కథాకమామీషు చూద్దాం…

బియ్యం మధుసూధనరెడ్డి …చిత్తూర్ జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త. నియోజక వర్గానికి సాగు నీరు సాధన ధ్యేయంగా అయన పాదయాత్ర తలపెట్టారు.గంగకోసం ..పాదయాత్ర అని దానికి నామకరణం చేసి సోషల్ మీడియా లో భారీగా ప్రచారం చేశారు.అయన పాద యాత్ర చేసాక సాగునీరు రాలేదు గానీ వాన పడింది.ఇంకేముంది బియ్యం అనుచరులు చెలరేగిపోయారు.తమ నాయకుడి పాదయత్రకి బాబు కరుణించకపోయినా సాక్షాత్తు వరుణ దేవుడే దిగి వచ్చాడని సోషల్ మీడియా లో విస్తృత ప్రచారం సాగిస్తున్నారు.ఇదంతా చూసిన నెటిజన్లు వైసీపీ లోనే జగన్ కి పోటీయా అని జోకులేసుకుంటున్నారు.బియ్యం గారు జర జాగ్రత్త ..జగన్ స్ప్పోర్తి అయితే పర్లేదు ..ఆయనకే పోటీ వెళితే కూర్చున్న కుర్చీ కూడా కదిలిపోతుంది…

Leave a Reply