జగన్ కి ఢిల్లీ ఫోబియా?

Posted November 5, 2016

jagan phobia on delhi
వైసీపీ అధినేత జగన్ కి ఢిల్లీ ఫోబియా ఉందా? ఆయనకి ఉందోలేదో తెలియదు గానీ టీడీపీ మాత్రం ఆ విషయాన్ని బలంగా నమ్ముతోంది.ప్రత్యేక హోదా డిమాండ్ తో విశాఖ లో జై ఆంధ్ర ప్రదేశ్ పేరుతో వైసీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.దీంతో రంగంలోకి దిగిన ఆ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి జగన్ మీదకి దాడి చేశారు.రాష్ట్ర ప్రయోజనాల కోసమని చెప్పుకుని సభ పెడుతున్న జగన్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దల్ని కలిసి ఏపీ కి ప్రత్యేక హోదా కావాలని అడిగారా?అని గంటా నిలదీశారు.దీంతో మరోసారి జగన్ ఢిల్లీ ఫోబియా అంశం బయటికి వచ్చింది.
జగన్ చంద్రబాబు మీద ఫిర్యాదు చేయడానికి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళలేదు?ఎందరు కేంద్ర మంత్రుల్ని కలవలేదు?కానీ ఒక్కసారి ఢిల్లీ పెద్దల్ని డీకొడితే ఏమైందో మాత్రం జగన్ కి అనుభవంలోకి వచ్చింది .ఫలించని సీఎం పీఠం కల,జైలు జీవితం ఒక్కసారి అయన కళ్ల ముందు గిర్రున తిరుగుతాయేమో! సోనియా తో పెట్టుకుంటేనే ఆలా ఉంటే ఇక మోడీ తో పెట్టుకుంటే పరిస్థితులు ఎలా వుంటాయో ఆయనకి తెలియదా?అందుకే టీడీపీ ఎంత రెచ్చగొట్టినా జగన్ ఆ ఒక్క విషయంలో మాత్రం సంయమనం పాటిస్తారు.ఈ బలహీనత కనిపెట్టిన టీడీపీ నేతలు ఆయనకున్న ఢిల్లీ ఫోబియాని అస్త్రంగా మలుచుకున్నారు.దీనికి విరుగుడు కోసం వైసీపీ వ్యూహకర్తలు ఎంత ఆలోచించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు .కాళ్ళకి కాదు మెడ దాకా చుట్టుకున్న కేసులు జగన్ అండ్ కో కి బ్రేకులేస్తున్నాయి. ఈ బ్రేకులేవోతండ్రి అధికారంలో వున్నప్పుడు వాడి ఉంటే ఇప్పుడీ తిప్పలు తప్పేవేమో !

SHARE