ముద్రగడకి జగన్ ఇచ్చిన ఆఫర్ ఏంటి?

0
432
jagan political offer to mudragada padmanabham

Posted [relativedate]

jagan political offer to mudragada padmanabham
కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపిస్తున్న ముద్రగడ పద్మనాభానికి వైసీపీ అధినేత జగన్ ఓ మాంచి రాజకీయ ఆఫర్ ఇచ్చాడంట.పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల ముద్రగడని కలిసినప్పుడు ఈ ఆఫర్ గురించే ప్రధానంగా చర్చ సాగిందట. ఇంతకీ జగన్ ఇచ్చిన ఆఫర్ …దాని కోసం పెట్టిన షరతు ఏంటో తెలుసా?

ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాలో ఏ ప్రాంతం నుంచైనా ముద్రగడ కోరుకున్న లోక్ సభ స్థానం నుంచి పోటీకి వైసీపీ అవకాశం ఇస్తుందట.అయితే అందుకోసం ఓ పని చేసి పెట్టాలంట. అదేమిటంటే వచ్చే ఎన్నికలు …2019 ఎన్నికలు జరిగేదాకా కాపు ఉద్యమాన్ని ఏదో రూపంలో లైవ్ లో ఉంచాలి.రిజర్వేషన్ సాధన కన్నా బాబు సర్కార్ ని టార్గెట్ చేయాలి.ఇందుకోసం ఏ అవసరం వచ్చినా ఆదుకోడానికి వైసీపీ అండగా ఉంటుందని ముద్రగడకి ఆ పార్టీ హామీ ఇచ్చిందట. ఆ ఆఫర్ మాట ఎలా వున్నా మరో రెండున్నరేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించడం అంత తేలిగ్గాదు.ఇప్పటికే అనుకున్న స్థాయిలో స్పందన రావడం లేదని ఇటీవల ముద్రగడ అసహనం చూశాం. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఆఫర్ కి ముద్రగడ ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply