జగన్ పూజ ఎవరికోసం?

August 10, 2016

 jagan pooja forwho
వైసీపీ అధినేత జగన్ రిషీకేశ్ ఎందుకెళ్లారు?అక్కడ జరిపిన పూజలు ఎవరి కోసం ?ఈ విషయంలో సొంత పార్టీ శ్రేణుల నుంచే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమని కొందరు …స్వరూపానంద స్వామి చేపట్టిన చాతుర్మాస దీక్షలో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారని మరికొందరు చెప్తున్నారు..ఇందులో ఏది నిజం ?ఈ రెంటికీ మించిన కారణం ఉందంటున్నారు లోటస్ పాండ్ సన్నిహితులు .

ఇటీవల కొన్ని కేసులకు సంబంధించి ఈడీ.. జగన్ ఆస్తుల్ని భారీ ఎత్తున అటాచ్ చేసింది.అప్పుడే ఆయన కొందరు జోస్యుల్ని సంప్రదించినట్టు తెలుస్తోంది .వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు కొన్ని పూజలు ,వ్రతాలు జరపాలని అప్పుడే నిశ్చయమైపోయిందట.అయితే వాటిని ఎక్కడ జరపాలి ?ఎప్పుడు జరపాలి ?వీటిపై కూడా చర్చలు జరిగాయట .శ్రావణ మాసం వచ్చాక అయితే మంచిదన్న సూచన ప్రకారమే ఇప్పటిదాకా వేచి ఉన్నారట.దగ్గర్లో ఈ పూజలు జరిపితే అసలు విషయం బయటపడొచ్చనే రిషికేష్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.ఆ పూజలకున్న ప్రాధాన్యత తెలియాలంటే ..జగన్ పక్కన వున్నవారిని చూస్తే తెలుస్తుంది.జగన్ థింక్ ట్యాంక్ గా భావించే అందరూ ఆయనతో వున్నారు.

మొత్తానికి పూజలు పూర్తి అయ్యాయి.జగన్ అండ్ కో ఆశలు మళ్లీ మేల్కొంటాయి .ఒకప్పుడు జోస్యుల మాట నమ్మి రెండేళ్లలో మన ప్రభుత్వం అని జగన్ డంకా భజాయించారు.ఆ రెండేళ్లు వచ్చివెళ్లాయి.ఇప్పుడు ఇంకో ఆశ ..మరో క్రతువు …ఇదంతా చూస్తుంటే దేవుడు వున్నాడో..లేడో చెప్పలేం ..మన కస్టాలు తీరుస్తాడని కూడా చెప్పలేము ..కానీ కష్టాలొస్తే ఆ దేవుడు గుర్తొస్తాడని మాత్రం చెప్పగలం జగన్ పూజలు ఎవరికోసమో అర్ధం చేసుకోగలం .

SHARE