బాలయ్యని పొగిడి జగన్ దొరికిపోయాడా?

 Posted March 22, 2017

jagan praise to balakrishna
సీఎం బావమరిది,వియ్యంకుడు కూడా అయిన బాలయ్య,ప్రతిపక్ష నేత జగన్ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? సహజంగా అయితే ఇద్దరూ ఉప్పునిప్పులా ఉండాలి.జగన్ దూకుడు చూస్తే మేటర్ ఇంకాస్త సీరియస్ గా ఉండాలి.కానీ వాస్తవ పరిస్థితి వేరంట.అదేంటో తెలుసుకోవాలంటే కాస్త ముందు వెనక్కి వెళ్ళాలి..

jagan says about balakrishna to tdp mla kadiri baburaoఇటీవల ఓ రోజు ఎయిర్ పోర్ట్ లో బాలకృష్ణ సన్నిహితుడు,దేశం ఎమ్మెల్యే కదిరి బాబురావు, ప్రతిపక్ష నేత జగన్ ఎదురుపడ్డారు.ఇద్దరూ యోగక్షేమాలు అడిగాక టాపిక్ ఇంకాస్త ముందుకు వెళ్ళింది.రాజకీయ నేతగా బాలయ్య ఎలా వ్యవహరిస్తున్నారు అన్నదానిపై ఆ ఇద్దరూ మాట్లాడుకున్నారట.అప్పుడే బాలయ్య చాలా మంచి వాడంటూ జగన్ కితాబు ఇచ్చాడంట.

ఈ విషయం ఆనోటాఈనోటా పడి బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న అనంత జిల్లా దేశం నేతలకి చేరింది.అందులో నిజానిజాలు తెలుసుకునేందుకు అసెంబ్లీ లాబీల్లో పయ్యావుల కేశవ్ నేరుగా కదిరి బాబూరావునే కదిలించారు.దానికి బదులిస్తూ కదిరి ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.అసెంబ్లీలో తనపై ఎవరేమి మాట్లాడినా బాలయ్య మాత్రం ఎప్పుడూ నోరుజారలేదని జగన్ అన్నాడంట.అందుకే బాలయ్యని మంచి వాడని జగన్ పొగిడినట్టు బాబురావు అభిప్రాయపడ్డారు. అయితే జగన్ తో తాను ఇంకా చాలా మంది మంచి వాళ్ళు వున్నారని అన్నట్టు బాబురావు వివరించారు.అయితే బాలయ్య మీద జగన్ కి ఇంత సాఫ్ట్ కార్నర్ ఏంటబ్బా అంటే ఓ పాత సంగతి చెప్పారు బాబురావు..అదేమిటంటే …ఒకప్పుడు కడప బాలయ్య ఫాన్స్ ప్రెసిడెంట్ గా జగన్ వున్నాడట.ఏదేమైనా అసెంబ్లీ లాబీల్లో బాలయ్య,జగన్ ఎపిసోడ్ ఆసక్తి రేకెత్తించింది.

SHARE