ఆగదు ఈ సమరం …. జగన్ ప్రెస్ మీట్

 

jagan press meet

 

ఆగదు ఈ సమరం ..జగన్

ప్రత్యేక హోదాపై రాజీపడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. హోదా కోసం చేపట్టిన రాష్ట్రబంద్ విజయవంతమైందని ఆయన తెలిపారు. బంద్ లో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కొన్ని శక్తులు అడ్డుకోవాలని చూసినా బంద్ విజయవంతమైందన్నారు.

చంద్రబాబు దగ్గరుండి ప్రజలపైకి పోలీసులను ఉసిగొల్పారని వైఎస్ జగన్ అన్నారు. బంద్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు యత్నించారన్నారు. హోదాకు అనుకూలమైతే బంద్ లో పాల్గొన్నవారిని ఎందుకు అరెస్ట్ చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు. హోదాపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా పోరాటం చేయడం దురదృష్టకరమన్నారు.ప్రత్యేక హోదా కోసం తాము ఎన్నో రకాల పోరాటలు చేశామని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. చివరికి హోదా కోసం నిరవధిక దీక్ష కూడా చేశామన్నారు. 8 రోజుల నిరవధిక దీక్ష చేస్తే రాష్ట్రానికి మోదీ వస్తున్నారని దీక్షను భగ్నం చేశారని ఆయన తెలిపారు.స్వాతంత్ర్య పోరాట సమయంలో చంద్రబాబు ఉండుంటే బ్రిటిష్ వారు ఇచ్చినప్పుడు స్వాతంత్ర్యం తీసుకుందామనే వారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం ఏమైనా సంజీవనా అని చంద్రబాబు మాట్లాడేవారని, మన అదృష్టం ఏంటంటే అప్పుడు చంద్రబాబు లేకపోవడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉండటం మన కర్మ అన్నారు.పథకం ప్రకారమే చంద్రబాబు ప్రత్యేక హోదాను నీరుగారుస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తందున్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు మరచిపోవచ్చేమో కానీ, అయిదుకోట్లమంది ప్రజలు మరచిపోరని అన్నారు. ప్రత్యేక హోదాపై తాము రాజీ లేకుండా పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ తెలిపారు.బంద్ లో పాల్గొన్న సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాలకు వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. లాఠీ దెబ్బలను లెక్క చేయకుండా అక్కచెల్లెమ్మలు బంద్ లో పాల్గొన్నారన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here