Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అవసరానికి తగినట్టు మాట్లాడి ఆపై మర్చిపోవడం రాజకీయ నేతలకు కొత్తేమీ కాదు.కాకపోతే
ఒక్కోసారి ఎవరి మీదకో అస్త్రం విసిరితే అది మన మెడకే చుట్టుకుంటుంది.ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కి కూడా అదే పరిస్థితి.ఇప్పుడు ప్రధాని మోడీని కలిసిన ఊపులో nda రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు అంటూ జగన్ చెప్పేసారు.ఇక ఆ పార్టీ నేతలైతే బీజేపీ తో తమకు పొత్తు కుదిరినట్టే ఊహల్లో తేలిపోతున్నారు.దానికి తగ్గట్టే మాట్లాడుతున్నారు.కానీ ఇప్పుడే జగన్ చేసిన ఓ భారీ స్టేట్ మెంట్ ని టీడీపీ ముందుకు తెస్తోంది.దానికి ఏ సమాధానం ఇవ్వాలో తెలియక వైసీపీ సతమతమవుతోంది.ఇంతకీ ఆ ప్రకటన ఏంటా అనేగా మీ డౌట్.అక్కడికే వస్తున్నాం..
జల్లికట్టు ఉద్యమ నేపథ్యంలో ఏపీ యువత వైజాగ్ లో ఏపీ ప్రత్యేక హోదా కోసం జనవరిలో ఓ సభ నిర్వహణకు ప్రయత్నించింది.అయితే అది జరక్కుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది.ఆ టైం లో వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో చేసిన హడావిడి అందరికీ ఇంకా గుర్తుంది.ఆ రోజు జగన్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు.ప్రభుత్వం ఎంతగా అడ్డుకున్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరతామని ఆయన చెప్పారు.అందుకోసం జూన్ తర్వాత వైసీపీ ఎంపీ లు రాజీనామాలు చేస్తారని ఆర్భాటంగా ప్రకటించారు.ఆయన చెప్పిన జూన్ రానే వస్తోంది.ఇక మోడీ అపాయింట్ మెంట్ దొరగ్గానే వైసీపీ నేతలు పాత విషయాన్ని మర్చిపోయారు.కానీ టీడీపీ నేతలు ఇప్పుడు అదే విషయాన్ని ముందుకు తెస్తున్నారు.జగన్ డెడ్ లైన్ గుర్తు చేస్తున్నారు.రాజీనామాల జోలికి వెళితే మోడీకి ఎక్కడ కోపం వస్తుందో అన్న భయం ఓ వైపు..ఇచ్చిన మాట తప్పితే బీజేపీ తో కుమ్మక్కు అయ్యారన్న ఆరోపణలు ఇంకో వైపు ..ఈ రెంటి మధ్య నలిగిపోతున్న జగన్ ఇప్పుడు టీడీపీ కి మాత్రమే కాదు జనానికి,సొంత పార్టీ నేతలకు కూడా ఏమి చెప్పాలో తెలియక నలిగిపోతున్నారు.