పుష్కర ఆహ్వాన అలజడి..దేశం,వైసీపీ డీ..

 jagan pushkara invitaion words war
అధికార,ప్రతిపక్షాలు ఢీకొట్టుకోవడం సహజం.అయితే ఆ పోరాటం చేసే విషయం ఎలాంటిదన్న కనీస స్పృహ ఉండాలి.ఆంధ్రాలో దేశం,వైసీపీ ఆ విషయం మర్చిపోయినట్టున్నాయి.ప్రతిపక్ష నేత జగన్ కి పుష్కర ఆహ్వానం విషయంలో కూడా రెండు పార్టీలు బజార్నపడ్డం చూసి జనం అవాక్కవుతున్నారు.
పుష్కర ఆహ్వానం విషయంలోరెండు పార్టీలు చెరో మాట చెబుతున్నాయి.

మంత్రి రావెల కిషోర్ బాబు,విప్ కూన రవి కుమార్ లు …జగన్ కి ఆహ్వానపత్రిక ఇవ్వడానికి లోటస్ పాండ్ వెళ్లడంతో విషయం బయటకొచ్చింది.వాళ్ళు అపాయింట్మెంట్ లేకుండా వచ్చారని వైసీపీ వర్గాలు చెప్పాయి.పైగా పుష్కరాలు మొదలయ్యాక,జగన్ లేని సమయంలో రావటమేంటని ప్రశ్నిస్తున్నాయి.దీనికి రావెల కౌంటర్ ఇచ్చారు .15 రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా జగన్ బిజీగా ఉన్నట్టు చెబుతున్నారని రావెల అంటున్నారు.మరోసారి రావడానికి ప్రిపేర్ అయ్యారు.ఇంతలో హోమ్ మంత్రి చినరాజప్ప కలగచేసుకొని మరో కొత్త విషయం చెప్పారు.తాను స్వయంగా ఆహ్వానపత్రిక తీసుకొని జగన్ ఇంటికెళ్తే అక్కడి సిబ్బంది దురుసుగా మాట్లాడారన్నారు.బయట పోస్టల్ డబ్బాలో పత్రిక వేయమని వాళ్ళు చెప్తే అదే పని చేశామని వివరించారు.

మరోవైపు జగన్ లేని సమయంలో మంత్రులు ఇంటికొచ్చి రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేత పార్థసారథి ఆరోపించారు .దీని వెనుక ఆయన్ను జనం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.ఈ వ్యవహారం చూసిన ప్రజలకి ఓ కొత్త సందేహం వచ్చింది …ఓ శుభకార్యానికి పిలవడం ,వచ్చినవాళ్ళని సరిగ్గా గౌరవించడం కూడా తెలియని వాళ్ళని మనం నాయకులుగా ఎన్నుకున్నామా అని …దీన్ని కూడా రాజకీయం అని ఆ పార్టీ లు అనుకుంటాన్నాయేమోగానీ ..జనంలోకి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది ..

SHARE