కాంగ్రెస్ కు జ‌గ‌న్ ష‌ర‌తులు !!!

0
295
jagan put conditions to congress

Posted [relativedate]

jagan put conditions to congress
రాష్ట్ర విభ‌జ‌నకు కార‌ణ‌మైన కాంగ్రెస్ ఇప్పుడు ఏపీలో ఉనికిని చాటుకునేందుకు ఆపసోపాలు ప‌డుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ నుంచి వేరుప‌డి సొంత పార్టీ పెట్టుకున్న జ‌గ‌న్ తో పొత్తు కోసం ఉవ్విళ్లూరుతోంది. ఆదిశ‌గా కాంగ్రెస్ నేత‌లు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట‌. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఎంపీలుగా ఉండి… ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌హిష్కరించబ‌డిన కొంత‌మంది నాయ‌కులు ఈ దిశ‌గా మంత‌నాలు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు లేక‌పోయినా… ఫ్యూచర్ లో పొత్తు దిశ‌గా ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయట.

ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఢ‌క్కామొక్కీలు తింటోంది. ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. ఎంపీలు కూడా ఆదిశ‌గా ప్రయ‌త్నాలు చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. అందుకోసం ఒక జాతీయ పార్టీతో పొత్తు ఆ పార్టీకి అనివార్యంగా మారింది. బీజేపీ ఎలాగూ ద‌గ్గర‌కు రానివ్వదు… కాబ‌ట్టి కాంగ్రెస్ తో స‌ర్దుబాటు చేసుకోవాల‌ని ఆలోచిస్తోంద‌ట‌. అందుకు జ‌గ‌న్ ఇప్పటికే పార్టీ శ్రేణుల‌కు సంకేతాలిచ్చాడ‌ని ప్రచారం జ‌రుగుతోంది.

కాంగ్రెస్- వైసీపీ మ‌ధ్య పొత్తు కుద‌రాలంటే జ‌గ‌న్ … హ‌స్తం పార్టీకి కొన్ని షరతులు పెట్టార‌ని టాక్. ఒక‌టి ప్రత్యేక హోదా పోరుపై ఇప్పుడు వైసీపీ ఢిల్లీలో ఉద్యమం చేస్తే… కాంగ్రెస్ మ‌ద్దతివ్వాల‌ట‌. హ‌స్తం పార్టీ అగ్రనేత‌లు రాహుల్, సోనియా గాంధీ అందులో పాల్గొనాల‌ట‌. ఇక పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడితే కాంగ్రెస్ మ‌ద్దతు ప‌ల‌కాల‌ని కండిష‌న్ పెట్టార‌ట‌. అంతేకాదు కేసుల విష‌యంలోనూ జాతీయ‌స్థాయిలో త‌న‌కు అనుకూలంగా మాట్లాడాల‌ట‌. ఇలా మొత్తానికి అన్నీ త‌న‌కు అనుకూలంగా ఉండాల‌ని ఆయ‌న కోరుకుంటున్నారని టాక్. అంతేకాదు త‌ద్వారా కాంగ్రెస్సే త‌న‌దారిలోకి వ‌చ్చేసింద‌న్న సంకేతాలు వెళ్లేలా చేయ‌డ‌మే జ‌గ‌న్ ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది.

అయితే జ‌గన్ ష‌ర‌తుల‌కు కాంగ్రెస్ మొగ్గు చూపుతుందా అన్నది అనుమాన‌మే. ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలకు జ‌గ‌న్ పై మంచి అభిప్రాయం లేదు. ఏదో రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల ఒత్తిడి మేర‌కే జ‌గ‌న్ తో పొత్తు గురించి ఆలోచిస్తున్నార‌ట. ఈ ష‌ర‌తుల విష‌యం క‌నుక వారికి తెలిస్తే… పొత్తు పొడ‌వ‌కుండానే జ‌గ‌న్ ను దూరం పెట్టడం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.

Leave a Reply