చిరు టీడీపీ ఎంట్రీ కి జగన్ కారణమా?

 Posted November 4, 2016

jagan reason for chiranjeevi join in tdp partyమెగా స్టార్ చిరంజీవి టీడీపీ లో చేరడం ఖరారైపోయినట్టే కనిపిస్తోంది.ఇక ముహూర్తం మాత్రమే బ్యాలన్స్ వుంది.ఆ ముహూర్తం కోసం చిరు సన్నిహితులు ఓ పురోహితుడితో మాట్లాడిన విషయం బయటికి వచ్చింది.ఆ పురోహితుడు రెండు తేదీలు చెప్పినట్టు తెలుస్తోంది.అందులో ఒకటి నవంబర్ 9, నవంబర్ 14 .ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు చిరు దేశం తీర్ధం పుచ్చుకుంటారట.ఆయనతో పాటు తమ్ముడు నాగబాబు కూడా టీడీపీ లో చేరొచ్చని తెలుస్తోంది.చిరంజీవిని మళ్లీ రాజ్యసభకు పంపి కేంద్రమంత్రిని చేస్తామన్నది టీడీపీ హామీ అట.

చిరంజీవి ఇలాంటి నిర్ణయం తీసుకోడానికి వైసీపీ అధినేత జగన్ కారణమని తెలుస్తోంది.10 జన్ పథ్ పొత్తు ప్రతిపాదనలతో జగన్ తో సంప్రదింపులు మొదలెట్టగానే అయన సీఎం అభ్యర్థిగా ముందస్తు ప్రకటన చేయాలని షరతు పెట్టారట.పైగా కాంగ్రెస్ లో జనాదరణ ఉన్న నాయకులూ తనకి పోటీ కాకుండా చూడాలని కోరారట.ఈ విషయం బయటికి పొక్కడంతో చిరు హర్ట్ అయ్యారట .కాంగ్రెస్ తన్ని అవసరానికి వాడేసుకుని మళ్లీ జగన్ తో పొత్తుకు ప్రయత్నించడాన్ని అయన జీర్ణించుకోలేకపోతున్నారట.ఇక మరో దారి చూసుకుందామని భావిస్తున్న దశలో లోకేష్,చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం .ఏదేమైనా చిరు అనూహ్య నిర్ణయానికి జగన్ కారణమయ్యారు.ఒకప్పుడు జగన్ కి ప్రత్యామ్న్యాయంగానే చిరంజీవికి కాంగ్రెస్ పెద్ద పీట వేసింది.ఇప్పుడు అదే జగన్ కోసం వెంపర్లాడుతోంది.ఏమైనా కాంగ్రెస్ పాచికలాటలో జగన్,చిరు పావులయ్యాయారు.

SHARE