హోదాతో లాభాలున్నాయి…. జగన్

  jagan said special status so many uses

హోదా వ‌ల్ల ఉత్త‌రాది రాస్ట్రాలు ఏమేర‌కు అభివ‌`ద్ధి చెందాయ‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. హోదాతోనే చిన్న చిన్న రాష్ట్రాలు ప్ర‌గ‌తి ప‌థంలో న‌డుస్తున్నాయి. ఉత్త‌రాఖండ్ హిమాచ‌ల ఫ్ర‌దేశ్ లో ప‌రిశ్ర‌మ‌లు అభివ‌`ద్ధి చెందాయి. కోట్లాది రూపాయ‌లు పెట్టుబ‌డులు మ‌ళ్ళాయి.. ల‌క్ష‌ల‌లో ఉద్యోగాలు ల‌భించాయి. హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో 10 864 ప‌రిశ్ర‌మ‌లు. రాగా ల‌క్ష 30 వేల ఉద్యోగాలు వ‌చ్చాయి. అదే విధంగా ఉత్త‌రాఖండ్‌లో 30 వేల ప‌రిశ్ర‌మ‌లు రాగా దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల ఉద్యోగాలు ల‌భించాయి. పారిశ్రామిక రాయితీలుంటాయి. ఆదాయం ప‌న్ను రాయితీ ఉంటుంది. జీఎస్‌టీలో కూడా హోదా రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక స‌దుపాయాలుంటాయి. ఎక్స‌యిజ్ డ్యూటీ మిన‌హాయింపు ఉంటుంది హోదా రాస్ట్రాల‌కు. వాస్త‌వాలు ఇవి కాగా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు..

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ప‌నుల‌కు ఉమ్మ‌డి రాష్ట్రంలో చోటు చేసుకున్న అయిదు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చును ఇచ్చేది లేద‌ని అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు. అదే విధంగా నీటి ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టు ప‌నుల‌కు నిధులు ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. వాస్త‌వం ఇది అయితే పోల‌వ‌రం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు ఇస్తున్నార‌ని చంద్ర‌బాబు చంక‌లు గుద్దుకుంటున్నారు. రూ 2. ల‌క్ష‌ల 25 వేల కోట్లు ప్యాకేజి రూపంలో అందుతాయ‌ని వెంక‌య్య‌నాయుడు ప్ర‌క‌టిస్తున్నారు.. ఏపీకి మోసం చేస్తూ పైకి ప్యాకేజి ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం ధ‌ర్మ‌మేనా? పోల‌వ‌రం నిర్మాణానికి మూడు ఏళ్ళ‌లో రూ 950 కోట్లు ఇచ్చి త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.పోల‌వ‌రం విష‌యంలో కేంద్రం మోసం చేసింది.

SHARE