వైసీపీ ఎమ్మెల్యేల రేటు పెరిగింది..

 Posted October 31, 2016

jagan says chandrababu buying mlas with corruption money
టీడీపీ సర్కార్ ఆపరేషన్ ఆకర్ష్ వెనుక భారీ ఎత్తున డబ్బు ఖర్చుపెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.ఇప్పుడు ఆకర్ష్ కాస్త ఆగినట్టు కనిపిస్తోంది కాబట్టి వైసీపీ అధినేత జగన్ ఉపశమించారు గానీ అప్పట్లో అయన టీడీపీ ….వైసీపీ ప్రజాప్రతినిధుల్ని కొనుగోలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు.ఒక్కో ఎమ్మెల్యేకి 15 నుంచి 20 కోట్లు ఆఫర్ చేస్తోందని జగన్ ఆరోపించారు.అయితే అబ్బాయి చెప్తున్న రేటు కరెక్ట్ కాదంటున్నారు బాబాయ్ వివేకానంద రెడ్డి .ఒక్కో ఎమ్మెల్యేకి టీడీపీ 25 నుంచి 40 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తోందంటూ అయన ధ్వజమెత్తారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓట్లు కొనుగోలు చేస్తోందని వస్తున్న ఆరోపణలపై అయన కౌంటర్ ఇది.

SHARE