నంద్యాల లో పోటీకి సై అంటున్న జగన్..

0
379
jagan says ready to participate nandyal by elections

Posted [relativedate]

jagan says ready to participate nandyal by elections
భూమా నాగిరెడ్డి మృతికి సంబంధించి అసెంబ్లీ లో సంతాప తీర్మానానికి దూరంగా వున్న వైసీపీ అధినేత జగన్ అందుకు కారణాలు వివరించారు.మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా భూమా ఎపిసోడ్ మీద తన అభిప్రాయాలు చెప్పి,నంద్యాలలో పోటీకి సై అన్నారు. ఆ చిట్ చాట్ లో జగన్ ఏమన్నారో చూద్దాం..

 • సంతాపం సమయంలో కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారు..
 • సంతాపం నుండి కూడా రాజకీయాలు బయటకి వచ్చాయి..
 • మేము సభకి వెళ్తే భూమా మంచితో పాటు.. చివరి దశలో అయన చేసిన తప్పు కూడా చెప్పాల్సి వచ్చేది..
 • చనిపోయిన వ్యక్తి గురించి చెడుగా ఎందుకు మాట్లాడటం అని వెళ్ళలేదు..
 • అసెంబ్లీ రికార్డ్స్ కి అయన చెడు ఎక్కడం ఇష్టంలేకే సభకు వెళ్లకుండా మంచితనం చూపించాం..
 • చంద్రబాబు తప్పు చేస్తే భూమా తప్పు చేశారు..
 • భూమా మరణ వార్త విని చాల బాధపడ్డా వెంటనే ఫోన్ లో అఖిలతో మాట్లాడా..
 • భూమా గారు చనిపోయిన 24 గంటల్లోనే అఖిలను అసెంబ్లీ కి తీసుకొచ్చారు..అది చంద్రబాబు కుసంస్కారం..
 • కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు కూడా అవకాశం లేకుండా రాజకీయాల కోసం అఖిలను సభకు తీసుకొచ్చారు..
 • వ్యక్తిగత విషయాలు పార్టీ లో పనిచేయవు..పార్టీ అన్నాక క్యాడర్ ని కూడా దృష్టి పెట్టుకోవాలి…
 • పార్టీ మారిన మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తాము అని చంద్రబాబు భూమాకి హామీ ఇచ్చారు..అదే ఆశతో అయన పార్టీ మారుతుమట్లు మా వారితో చెప్పారు.. ఆ సమయంలో భూమా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పార్టీ మారిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వలేరని తెల్సి కూడా భూమా కి ఆ ఆశ చూపించారు..
 • అలాంటి వ్యక్తిని ఏడాదిగా మంత్రి ఇవ్వకుండా మానసిక క్షోభకి గురిచేశారు..
 • ఎన్టీఆర్ ని ఏ విధంగా మానసిన క్షోభకి గురిచేశారో భూమని అదేవిధంగా చేసాడు..
 • రాజకీయాల్లో నాకు చంద్రబాబుకి నక్కకి నాగ లోకానికి ఉన్న తేడా ఉంది..
 • నేను ఎవరినైనా పార్టీలోకి తీసుకుంటే హుందాగా రాజీనామా చేయించి మళ్ళీ గెలిపిస్తా..
 • నా రాజకీయం హీరో లా ఉంటాది. చంద్రబాబు ది విలన్ రాజకీయం..
 • నంద్యాల సీటు మాది.. కచ్చితంగా పోటీ పెడతాం.. దీనిపై తుది నిర్ణయం చెప్తాం..

Leave a Reply