జగన్ కి అమరావతి అంటే భయమెందుకంటే?

Posted September 26, 2016

 jagan scared amaravathi
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే వైసీపీ అధినేత,ప్రతిపక్ష నేత జగన్ కి భయమా ?అందుకే ఎప్పటికప్పుడు నివాసం మారుస్తానని చెప్పి కూడా అయన హైదరాబాద్ నుంచి కదలడం లేదా ? అమరావతి కి రాకుండా సాకులెందుకు వెదుకుతున్నారా అని ఆరా తీస్తే వైసీపీ వర్గాల నుంచి షాక్ తగిలే అంశాలు వెల్లడయ్యాయి. ఒకానొక దశలో బాబు కన్నా ముందే రాజధాని ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని జగన్ భావించారట.ఆ సంగతి చూడమని పార్టీ శ్రేణులకు కూడా చెప్పారట.ఇంతలో ఓటుకునోటు కేసులో బాబు అండ్ కో దొరికిన వైనం చూసాక జగన్ మనసు మారిందట.

ఒక వేళ అమరావతికి వస్తే అనుక్షణం రాష్ట్ర నిఘా విభాగం తన కార్యకలాపాలపై కన్నేస్తుందని జగన్ కి డౌట్ వచ్చిందట. తెలంగాణ సర్కార్ తరహాలోనే బాబు ప్రభుత్వం వ్యవహరిస్తే కష్టాలు తప్పవని జగన్ భయపడుతున్నారట.అదే హైదరాబాద్ లో నివాసముంటే అలాంటి ఇబ్బందులుండవని జగన్ భావిస్తున్నారట. అయితే ఓటుకునోటు కేసు బాబు తో పాటు జగన్ ని సైతం భయపెట్టిందన్నమాట.

SHARE