బాబాయ్ కి జగన్ ఝలక్ ..

Posted October 7, 2016

 jagan shocked ys vivekananda reddy jammala madugu assembly seat purpose

సొంత కుటుంబ సభ్యులైనా తన మాట వినకుంటే వారిని పక్కనపెట్టడం ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కు బాగా అలవాటు అని రాజకీయ వర్గాలు అంటుంటాయి.రాజకీయాల్లో రాణించాలని ఆరాటపడుతున్న తన చెల్లెలు షర్మిలను కూడా జగన్ ఇదే రకంగా పక్కనపెట్టారని కొందరు నేతలు చాటుగా చర్చించుకుంటుంటారు. షర్మిల క్రీయాశీలకంగా వ్యవహరిస్తే… పార్టీలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందనే భావనతోనే జగన్ ఆమెను పక్కనపెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది. కుటుంబసభ్యుల్లో ఒక్క తన కజిన్ అవినాష్ రెడ్డికి తప్ప… ఎవరికి మంచి అవకాశం ఇవ్వని జగన్… తాజాగా తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని కూడా నిరాశపరిచాడని కడప జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది

రీసెంట్ గా కడప జిల్లాలో పర్యటించిన జగన్ వెంట పర్యటించిన వైఎస్ వివేకా… జమ్మలమడుగు నుంచి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి తాను పోటీ చేస్తానని… ఈ సీటును తనకే కేటాయించాలని జగన్ ను కోరారట. ప్రస్తుతం ఆ స్థానం నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో… జగన్ ఈజీగానే తన ప్రతిపాదనకు ఒప్పుకుంటాడని వివేకా భావించారట. అయితే జగన్ మాత్రం ఇందుకు సంబంధించి బాబాయ్ కి ఎలాంటి హామీ ఇవ్వలేదట.పార్టీలోనే కొనసాగండి. ఎన్నికల నాటికి ఈ విషయం గురించి ఆలోచిస్తా అంటూ నిర్మోహమాటంగా సమాధానం చెప్పారట. చూస్తుంటే… పార్టీ నేతలను ఎక్కువగా విశ్వసించరనే అపవాదు ఉన్న జగన్… చిన్నాన్నను కూడా అంతగా నమ్మడం లేదని భావించకతప్పదేమో.

SHARE