హోదా,ఎంపీ ల రాజీనామా పై జగన్ మౌనం వెనుక?

0
499
jagan silence for mp relieving

Posted [relativedate]

jagan silence for mp relieving

ఇప్పుడంతా పెద్ద నోట్ల రద్దు దాని ప్రభావం చుట్టూ ఆలోచిస్తున్నారు గానీ …ఈ నిర్ణయం వెలువడక ముందు వైసీపీ అధినేత జగన్ యువ భేరీ పేరిట రాష్ట్రమంతటా తిరిగి ప్రత్యేక హోదా ప్రయోజనాల్ని ప్రజలకి వివరించారు.ఏపీ కి హోదా కోసం అవసరమైతే వైసీపీ ఎంపీ లతో రాజీనామా చేయిస్తానన్నారు.వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై అలుపెరగని పోరాటం చేస్తామన్నారు.అయితే పార్లమెంట్ లో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవనుకోవాలి. కానీ ఎంపీ ల రాజీనామా అస్త్రం. మాత్రం జగన్ చేతిలోనే వుంది.అయినా ఆ విషయం గురించి జగన్ మాత్రమే కాదు ఒక్క వైసీపీ ఎంపీ కూడా ప్రస్తావించడం లేదు. ఎందుకిలా అందివచ్చిన అవకాశాన్ని జగన్ ఎందుకు జారవిడుచుకుంటున్నారు? ఈ ప్రశ్నకి వైసీపీ సీనియర్ నేత ఒకరు ముఖ్యమైన సమాచారం బయటపెట్టారు.

ఓ రెండునెలల కిందట కాంగ్రెస్, వైసీపీ వచ్చే ఎన్నికల దృష్టితో రహస్య చర్చలు జరిగాయట. బీజేపీ,టీడీపీ కూటమి ఓటమికి అవసరమైన వ్యూహాలతో ముందుకెళ్లాలని అందులో ఓ నిర్ణయానికి వచ్చారట.పిల్ల కాంగ్రెస్ ,తల్లి కాంగ్రెస్ మధ్య కొత్త స్నేహానికి సంబంధించి టీడీపీ తగు సమాచారం సేకరించి కమలం పెద్దల ముందు ఉంచింది.దీంతో అప్పటిదాకా జగన్ కేసుల విషయాన్ని చూసీచూడనట్టు వదిలేసిన కేంద్రం ఇక జగన్ ముందరి కాళ్ళకి బంధాలు వేయక తప్పదని డిసైడ్ అయిపోయిందట, తాజాగా ఈడీ …డిపాజిట్ ల స్వాధీనం వంటి తీవ్ర చర్యలకి దిగడం అందులో భాగమే అంటున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ హోదా పోరాటం,ఎంపీ ల రాజీనామా ప్రస్తుతానికి అటకెక్కినట్టే కనిపిస్తోంది.

Leave a Reply