ఆ వియ్యంకులు vs జగన్ ….లోగుట్టు ఇదేనా?

Posted March 30, 2017

jagan target to ganta srinivasa rao and minister narayana
10 వ తరగతి పరీక్షా పత్రాలు లీక్ ఆరోపణలతో మంత్రులు,వియ్యంకులైన గంటా శ్రీనివాసరావు, నారాయణల్ని వైసీపీ అధినేత ఇంతగా టార్గెట్ చేస్తున్నారు.ఆ ఇద్దర్నీ క్యాబినెట్ నుంచి తప్పించేదాకా ఈ అంశాన్ని వదిలిపెట్టకూడదని జగన్ భావిస్తున్నారు.చంద్రబాబు కన్నా ఈ ఇద్దరి మీదే జగన్ ఈ స్థాయిలో దృష్టి పెట్టడం అసలు కారణం వేరే ఉందట.

గంటా,నారాయణ…ఈ ఇద్దరూ మంత్రులుగా కన్నా నెల్లూరు,కడప రాజకీయాల్ని నడుపుతున్న తీరు జగన్ కి ఎక్కడో కాలేలా చేస్తోంది.2014 ఎన్నికల్లో అధికారం దక్కకపోయినా నెల్లూరు,కడప జిల్లాల్లో వైసీపీ కి మెజారిటీ సీట్లు దక్కాయి.కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడకుండా చేశారు గంటా,నారాయణ.నెల్లూరు రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా రెడ్డేతర నాయకుడిగా చక్రం తిప్పాడు నారాయణ.వైసీపీ నాయకులు,ఎమ్మెల్యేల్ని పార్టీ లోకి ఆకర్షించాడు.ఆనం బ్రదర్స్ ని కాంగ్రెస్ నుంచి టీడీపీ లోకి వచ్చేలా చేసి నెల్లూరు లో వైసీపీ కి దీటుగా పార్టీ ని తీర్చిదిద్దడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు.ఇక గంటా ఇంచార్జి మంత్రిగా వున్న జగన్ సొంత జిల్లా కడపలో నిన్న గాక మొన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసు.ఎవరెంత రాజకీయం చేసినా జిల్లాలో వై.ఎస్ కుటుంబం మీద అభిమానాన్ని బద్దలు కొట్టలేరని జగన్ భావించారు.కానీ గంటా ప్లానింగ్ తో వై.ఎస్ కుటుంబ కంచుకోట బద్దలైంది.జగన్ సొంత బాబాయ్ వివేకా ఓడిపోయారు.ఇకపై కడప రాజకీయంగా ఎవరి సొత్తు కాదని ప్రపంచానికి చాటాడు గంటా.ఈ రెండు విషయాలు జగన్ ని కలవరపెట్టాయి.ఇంతలో పదో తరగతి పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం ముందుకు వచ్చింది. అయితే వియ్యంకులిద్దర్నీ టార్గెట్ చేసేలా ఓ కుట్ర జరిగిందన్న వాదనలు కూడా టీడీపీ నేతలు ముందుకు తెస్తున్నారు.ఆ క్రమంలో సాక్షి రిపోర్టర్ గురించి ప్రస్తావన రావడంతో గంటా,నారాయణ vs జగన్ వెనుక ఇంకేదో ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

SHARE