డిఫెన్స్ లో జగన్ &కో..

 jagan team fall diffence
అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇరుకున పెట్టడానికి వైసీపీ అధినేత జగన్ పకడ్భంధీ వ్యూహం రచించారు.ఓ వైపు మంగళగిరి ఎమ్మెల్యేతో ఓటుకునోటు కేసు అంశంపై ఏసీబీ కోర్టుని ఆశ్రయించేలా చేశారు.మరోవైపు వైసీపీ లోని కాపు నేతలని ముద్రగడ ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహించేలా చేసి ..బాబుని టార్గెట్ చేశారు.అయితే ఈ రెండు అంశాలు బాబు వ్యూహచతురత ముందు నిలవలేకపోయాయి .

ఓటుకునోటు కేసులో ఏసీబీ కోర్టు ఉత్తర్వు పై హై కోర్ట్ స్టే ఇచ్చింది .దాంతో ఒక అస్త్రం జగన్ చేజారింది .ఇక కాపు ఉద్యమం విషయంలో ముద్రగడ,భూమన కరుణాకర రెడ్డి మధ్య ఉన్న సంబంధాల్ని cid విభాగం కూపీ లాగుతోంది .తుని విధ్వంసం సమయంలోనే భూమనపాత్రపై ఆరోపణలొచ్చాయి .అయితే 8 నెలల తరువాత భూమనకి నోటీసులు,విచారణతో వైసీపీ డిఫెన్స్ లో పడింది .విచారణలో వెల్లడయ్యే అంశాలు పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని జగన్ ఆందోళన పడుతున్నారు.మొత్తానికి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆఫెన్సు ఆడదామనుకున్న జగన్ డిఫెన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది .

SHARE