కాంగ్రెస్ ముద్దు..పవన్ వద్దు …జగన్ ఆలోచన?

  jagan thinking pawan kalyan no congress ok
జగన్ ఎంత పోరాడినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని తేల్చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో సలహా ఏమిచ్చారో గుర్తుందా? ప్రజాస్వామ్యంలో మెజారిటీకి విలువ కాబట్టి బీజేపీ,టీడీపీ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్,వైసీపీ,కమ్యూనిస్టు లు,పవన్ కళ్యాణ్ కలిసి పోటీచేసి వారిని ఓడించాలని ఉండవల్లి సూచించారు.ఈ సూచన వల్ల వచ్చే ప్రయోజనం జగన్ ని ఊరిస్తోంది.అయితే ఆ సలహాలో ఓ సవరణకు జగన్ మొగ్గుచూపుతున్నారు.అది పవన్ కళ్యాణ్ తో కలవడం.ఆ ఒక్కటి తప్ప ఇక దేనికైనా సై అంటున్నారు.

పైకి కాంగ్రెస్ తో పొత్తు ఉండదని చెబుతున్న జగన్ తాజా ప్రకటనతో అది నిజం కాదని తానే చెప్పారు.nri ల తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో హోదాకి అనుకూలంగా వున్న పార్టీతో పొత్తని చెప్పారు.జాతీయ స్థాయిలో ఆ వైఖరి తో వుంది కాంగ్రెస్ పార్టీనే.ఈ విషయం చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు.తనని కక్షగట్టి జైలుకి పంపిన పార్టీతో పొత్తుకు ఓకే అనుకుంటున్న జగన్ …పవన్ విషయంలో అంత పట్టుదలగా ఎందుకున్నారో అర్ధం గాకుండా వుంది.బహుశా ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనేమో !

SHARE