బాబూ మేలుకో… జగన్ కి సాక్షి చేయలేనిది..అది చేస్తోంది

0
643
jagan Trends on Social Media better than chandrababu

Posted [relativedate]

jagan Trends on Social Media better than chandrababu
మీడియా రంగ ప్రాధాన్యాన్ని ,ఆ రంగంలో వస్తున్న మార్పుల్ని గుర్తించడంలో వైసీపీ అధినేత జగన్ తరువాతే ఎవరైనా.తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన ఎన్నో వ్యాపారాలు మొదలెట్టినా సాక్షి పత్రిక మీద స్పెషల్ ఇంటరెస్ట్ చూపారు.ఒక టైం లో ఈనాడుకు దీటుగా సాక్షి సర్క్యూలేషన్ వుంది.జగన్ అంచనా వేసినట్టే 2009 ఎన్నికల్లో సాక్షి పత్రిక కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించింది.వై.ఎస్ మరణం తర్వాత జగన్ పెట్టిన కొత్త పార్టీకి నీరు,నారు పోసింది సాక్షి పత్రిక అని వేరే చెప్పక్కర్లేదు.అయితే 2014 ఎన్నికల తర్వాత సాక్షి ప్రతిష్ట మసకబారింది.ఆ పత్రిక ఏకపక్ష కధనాల మీద విశ్వసనీయత తగ్గింది.ఈ విషయాన్ని జనం తో పాటు జగన్ కూడా గ్రహించారు.అందుకే కొత్త ఎత్తు వేశారు.

సాక్షి పత్రిక వైఖరిలో మార్పులు తెచ్చినా,అది జనంలోకి వెళ్లి,జనం దాన్ని నమ్మాలంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.ఇది గ్రహించిన జగన్ సాక్షి లో మార్పు కోసం వెంపర్లాడకుండా అసలు మీడియా రంగంలో వస్తున్న మౌలిక మార్పుల మీద దృష్టి పెట్టారు.పత్రికలు,ఛానెల్స్ స్థానాన్ని క్రమంగా సోషల్ మీడియా అదే డిజిటల్ మీడియా ఆక్రమిస్తోన్న విషయాన్ని జగన్ పసిగట్టారు.అందుకే ఈసారి జగన్ అదిరిపోయే ప్లాన్ వేశారు .సాక్షి తరహాలో జగన్ సొంత మీడియా అనే ముద్ర లేకుండా జాగ్రత్త పడ్డారు.

వైసీపీ కి అనుకూలంగా వివిధ పేర్లతో ఎన్నో వెబ్ సైట్స్ తెలుగు ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా చేశారు. తన దగ్గరికి ఉద్యోగాల కోసం వెళ్లిన జర్నలిస్టులు ఎంతోమందిని ఇలా వెబ్ సైట్ పెట్టేలా జగన్ ప్రోత్సహించారు.ఆ వెబ్ సైట్స్ కి ఆర్ధిక సహకారం అందిస్తున్నారు.అంత కన్నా ముఖ్యంగా జగన్ కి అనుకూలంగా సదరు వెబ్ సైట్స్ లో వచ్చే వార్తల్ని ప్రమోట్ చేసేందుకు వైసీపీ తరపున ఓ భారీ టీం పనిచేస్తోంది.దీనివల్ల ఆ వెబ్ సైట్స్ కి కూడా ప్రచారం వస్తోంది.దీంతో వాటి యజమానులు కూడా స్వామి కార్యం,స్వకార్యం జరుగుతుందన్న సంతోషంతో మరింతగా రెచ్చిపోయి జగన్ అనుకూల కధనాలు వండి వార్చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో జగన్ హవాకి సాక్ష్యమే తాజా గూగుల్ గణాంకాలు. గడిచిన మూడు నెలల్లో నెటిజెన్లు జగన్ విశేషాల కోసం పెద్ద సంఖ్యలో గూగుల్ ని ఆశ్రయించారు.ఈ లిస్ట్ లో మోడీ,రాహుల్ ,కేజ్రీవాల్ తరువాతి స్థానం జగన్ దే.మోడీ కోసం ప్రపంచవ్యాప్తంగా వెదికినవారి సంఖ్యలో సగం మంది తెలుగువాళ్లు జగన్ కోసం గూగుల్ లో వెదికారు.జాతీయ మీడియా దీనిపై భారీ కధనాలు ఇస్తున్నాయి.ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు,కెసిఆర్ లు జగన్ కన్నా బాగా వెనకపడ్డారు.ఇదంతా డిజిటల్ మీడియా మీద జగన్ ప్రత్యేక దృష్టి పెట్టిన ఫలితమే.ఈ విషయంలో జగన్ ముందు చూపు పనిచేస్తోంది.ఆయనకి సాక్షి చేయలేని పని సోషల్ మీడియా చేసి పెడుతోంది.

అటు పెద్ద పెద్ద మీడియా సంస్థలు తమకు అనుకూలంగా పని చేస్తున్నాయన్న నమ్మకంతో టీడీపీ ఈ విషయంలో కాస్త నిర్లక్ష్యం వహిస్తోంది.దీంతో ప్రస్తుతం తెలుగు న్యూస్ వెబ్ సైట్స్ లో దాదాపు 80 శాతం జగన్ మేనియా తో వూగిపోతున్నాయి.మిగిలిన 20 శాతం టీడీపీ కి అండగా ఉంటున్నా ప్రభుత్వం లేదా పార్టీ తరపున ఎలాంటి ఎంకరేజ్ మెంట్ లేకపోవడంతో డీలా పడుతున్నాయి.దీంతో టీడీపీ చాప కిందకి డిజిటల్ మీడియా నీరు చేరుతోంది. ఓ వైపు 2020 నాటికి డిజిటల్ మీడియా మొత్తం మీడియాలో 50 శాతం భాగస్వామ్యం చేజిక్కించుకుంటుందని ఓ సర్వే అంచనా.దీని మార్కెటింగ్ విలువ 20 వేల కోట్లు వుండొచ్చట.అయినా ఇప్పటిదాకా డిజిటల్ మీడియా కి యాడ్స్ విషయంలో టీడీపీ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది.అటు కేంద్రప్రభుత్వ విభాగాలు ఇప్పటికే డిజిటల్ మీడియా యాడ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఎప్పటినుంచో అమలు చేసేస్తోంది.ఇప్పటికైనా టీడీపీ ,చంద్రబాబు,లోకేష్ లు సోషల్ మీడియా మీద కన్నేయకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.ఇప్పుడే మేలుకుంటే ఎన్నికలకు రెండేళ్ల టైం వుంది.సోషల్ మీడియాలోనూ పట్టు సాధించే అవకాశం మిగిలే వుంది.

కిరణ్ కుమార్ 

Leave a Reply