ఆ పని జగన్ మామ నుంచి బాబాయ్ కెళ్ళింది..

0
180
jagan uncle yv subba reddy put Private Member Bill Of Special Status to AP in lok sabha

Posted [relativedate]

jagan uncle yv subba reddy put Private Member Bill Of Special Status to AP in lok sabha
వై .ఎస్,కేవీపీ కుటుంబాల మధ్య అప్పట్లో ఎలాంటి సంబంధాలుండేవో అందరికీ తెలిసిందే.ఇక వై.ఎస్ కుమారుడు జగన్ కూడా అదే చనువుతో కేవీపీ ని మామ అని పిలిచేవారు.కాలక్రమంలో ఆ ఇద్దరి మధ్య బంధం మళ్లీ బలపడుతుందేమో అనిపిస్తోంది.ఇంతలోనే కేవీపీ ఏపీ కి హోదా కోసం రాజ్యసభలో ప్రైవేట్ బిల్ మనీ బిల్లని తేలింది.దీంతో జగన్ మామ తలపెట్టిన పని అయన బాబాయ్ సుబ్బారెడ్డి చేతుల్లోకి వెళ్ళింది.అదెలాగంటే ..

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా డిమాండ్ తో కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రైవేట్ బిల్లు మనీ బిల్లు అని లోక్ సభ తేల్చింది.అప్పట్లో ఈ బిల్లు రాజ్యసభలో దుమారం రేపింది.ఆ బిల్లుకి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చూసే నా రక్తం మరిగిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అప్పట్లో రెచ్చిపోయారు కూడా.అయితే అది మనీ బిల్లు అంటూ జైట్లీ చెప్పడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ దాన్ని లోక్ సభ స్పీకర్ పరిశీలనకు పంపారు. బిల్లులోని అంశాలు చూసిన లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ అది ద్రవ్యబిల్లేనని తేల్చారు.ఇదే విషయాన్ని రాజ్యసభ లో కురియన్ ప్రకటించారు. దీంతో ఈ బిల్లుని ఇక లోక్ సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఆ బాధ్యత తీసుకుని లోక్ సభలో ఆ బిల్లు ప్రవేశపెడుతుందో లేదో చూడాలి.ఎందుకంటే ఆ పార్టీకి ఏపీ నుంచి లోక్ సభ కి ప్రాతినిధ్యమే లేదు.అయితే ఈ నిర్ణయం వెలువడే కొన్ని గంటల ముందే లోక్ సభలో వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి ప్రైవేట్ బిల్లు పెట్టినందున దానికి మద్దతిచ్చి పక్కకి తప్పుకుంటుందా చూడాలి.ఏదేమైనా జగన్ మామ నుంచి బాబాయ్ కి ప్రైవేట్ బిల్లు షిప్ట్ అయిపోయింది.

Leave a Reply