పవన్ కి వైసీపీ పాంచ్ పంచ్ ..

 Posted October 24, 2016

jagan vizag meeting november target on pawan kalyan
ఏపీ కి కేంద్రం ప్యాకేజ్ ప్రకటించాక ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమని వైసీపీ డిక్లేర్ చేసింది.ఆ పార్టీ అధినేత జగన్ ఒకటిరెండు చోట్ల యువభేరీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు .కానీ ఓ నెల రోజులుగా ఆ ఛాయకే వెళ్లని వైసీపీ మళ్లీ హోదాగోదాలోకి దిగుతోంది.హోదా డిమాండ్ తో 5 సభలు నిర్వహించడానికి వైసీపీ రెడీ అయిపోయింది.నవంబర్ ఆరున విశాఖపట్నం లో జై ఆంధ్రప్రదేశ్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.దీంతో సహా మొత్తం ఐదు మీటింగ్ లు జరిపి ..ప్యాకేజ్ కన్నా హోదా మేలని ప్రజలకి వివరించబోతోంది.విశాఖ సభ పోస్టర్ ని వైసీపీ సీనియర్ నేతలు నేడు హైదరాబాద్ లో విడుదల చేశారు.

ఈ ఐదు సభల పాంచ్ పంచ్ నిజానికి మోడీ సర్కార్ కి గురి పెట్టాలి.బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ ని కార్నర్ చేయాలి.ఆ రెంటి కన్నా ముందు ఈ పాంచ్ పంచ్ టార్గెట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని తెలుస్తోంది.అధికార పక్షాల మాట అటుంచి హోదా మొదలుకుని మెగా ఆక్వా పార్క్ దాక తమ ప్రతిపక్ష పాత్రకే ముప్పు తెస్తున్న పవన్ ని చూస్తూ వదిలేయకూడదని వైసీపీ భావిస్తోంది.అనంతపురం లో నవంబర్ 10 న పవన్ తలపెట్టిన సభకు ముందే విశాఖ సభ ప్లాన్ చేసింది వైసీపీ.ప్రజాసమస్యలపై దూకుడుగా పోరాడేందుకు అడ్డుగా నిలుస్తున్న పవన్ ని కూడా స్పేర్ చేయకూడదని జగన్ డిసైడ్ అయ్యాకే హోదాపై పాంచ్ పంచ్ కి దారిపడింది.

SHARE