ప్రత్యేక హోదా అంశం మీద పోరు ఉద్ధృతం చేస్తున్న వైసీపీ అధికార పక్షానికి మరో సవాల్ విసిరింది.హోదా,ప్యాకేజ్ లలో దేనివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తేల్చుకునేందుకు జగన్ తో బహిరంగ చర్చకు రావాలని వైసీపీ…చంద్రబాబు ని సవాల్ చేసింది.ఆ చర్చ విజయవాడ లేదా కుప్పంలో జరిపినా తాము సిద్ధమేనని వైసీపీ నేత పార్థసారథి స్పష్టం చేశారు.యువభేరి లో జగన్ చేస్తున్న ప్రసంగాలతో టీడీపీ వణికిపోతోందని…యువత బాబు ని నిలదీసే రోజు దగ్గరలోనే ఉందని అయన అన్నారు.
అయినా ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇలా ఛాలెంజ్ విసురుకోవడమే తప్ప నిజంగా అధికార,ప్రతిపక్షాలు ముఖాముఖీ చర్చకు దిగితే ఇద్దరి బండారం బయటపడటం ఖాయం.