ఉప ఎన్నికలకి జగన్ ఉబలాటం..

 Posted October 25, 2016

jagan want going to elections if ap special status not coming
తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ తరహాలోనే ఉప ఎన్నికలకి జగన్ ఉబలాటపడుతున్నారు.హోదా ఉద్యమాన్ని మరోసారి తీవ్రం చేయాలని భావిస్తున్న అయన కర్నూల్ యువభేరిలో కీలక ప్రకటన చేశారు.హోదా కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని అయన ప్రకటించారు.అయితే అది ఎప్పుడు?ఎలా ?అనేదానికి అయన ఇచ్చిన సమాధానం కాస్త విశేషం గానే కనిపిస్తోంది.ఈ పార్లమెంట్ సమావేశాలు ,వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హోదా కోసం పోరాడి …అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఆపై వచ్చే సమావేశాల్లో వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ చెప్పారు.అంతవరకు బాగానే వుంది …ఆపై వ్యూహాన్ని కూడా జగన్ వివరించారు.రాజీనామా తర్వాత ఉప ఎన్నికలకి వెళ్లి గెలిచి మళ్లీ హోదా కోసం పార్లమెంట్ లో పోరాడతారంట.

ఎప్పుడైనా పోరాడేది,పోరాడాల్సింది పార్లమెంట్ లో అని తెలిసినప్పుడు ..మధ్యలో ఉపఎన్నికల ఎపిసోడ్ గురించి ఆయనంతగా వత్తి చెప్పారో అర్ధం అవుతూనే వుంది.పోరాటం చేసేది హోదా కోసమని చెప్తున్నా టార్గెట్ …ముందు ఉప ఎన్నికలు..తర్వాత 2019 ఎన్నికలని అర్ధమవుతూనే వుంది.దాంతోపాటు హోదా ఉద్యమాన్ని అప్పటిదాకా నిలపొచ్చని జగన్ భావిస్తున్నారు.కానీ ఒక్క విషయాన్ని ఆకళింపు చేసుకోవాలి..రాజకీయాల్లో ఎత్తులు మాత్రమే కాదు ..పై ఎత్తులు కూడా ఉంటాయి.అందులో వాటిలో ఆరితేరిన మోడీ,బాబు ప్రత్యర్థులుగా వున్నారు..కాస్త ఆలోచించుకొని అడుగేయడం మంచిది జగన్ ..ఎందుకంటారా?మీరు ఉబలాటపడ్డ ఆ ఉపఎన్నికల్లో ఓటమి ఎదురైతే అసలుకే మోసం వస్తుందని వేరెవరో చెప్పాలా?

SHARE