జగన్ కు టైమ్ మిషన్ కావాలి…

0
447

   jagan want time mision ed noticesjag

‘ఆ దేవుడే  ఉన్నాడు.. అన్నీ  చూసున్నాడు’  ysrcp అధినేత ys జగన్ తరచూపలికే పలుకులివి.. వర్తమానంలో కాస్త కష్టాలున్నా భవిష్యత్ బాగుంటుందన్న  ఆశ  ఆ మాటల్లో ధ్వనిస్తుంటుంది.. కానీ జగన్ ఓ విషయం మర్చిపోయినట్టున్నారు. దేవుడు నిజంగా ఉంటే… ఆయన ఉన్న వర్తమానాన్ని,  భవిష్యత్ ను  చూడగలిగితే కచ్చితంగా గతాన్ని కూడా చూసేఉంటారుగా… అందుకే ఆ గత పనులు ఫలితాలే ఇప్పుడు చూస్తున్నాం..

2014 ఎన్నికలు పూర్తి అయి రెండేళ్లు గడిచాయి. చంద్రబాబు సర్కార్ మీద ఎంతో కొంత అసంతృప్తి మొదలైంది. తుని ఘటనలో జగన్ ప్రమేయం ఉన్నా, లేకున్నా.. ముద్రగడ దీక్ష ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటుంది.. ఈ పరిస్థితుల్నిఅనువుగా,అనుకూలం గా మార్చుకోవాలని జగన్ తలపోశారు. MLA ల పార్టీ ఫిరాయంపుల్ని  పట్టించుకోకుండా  ప్రజాక్షేత్రంలో నిత్యం నిలిస్తే చాలని ఆయన భావించారు. అది మంచి వ్యూహమే….. ఇప్పటిదాకా ఉన్న గడ్డు పరిస్థితులన్నీ మర్చిపోవడానికి, కొత్త శక్తి  కూడా దీసుకోడానికి కుటుంబం తో కలిసి విహారయాత్ర కోసం విదేశాలు వెళ్లివచ్చారు.. ఇక ప్రతిపక్షపాత్రలో   సర్వ శక్తులూ  ఒడ్డుదామనుకున్నారు… తానొకటి తలిస్తే దైవమొకటి తలసినట్టున్నాడు..రాజకీయ యుద్దానికి సిద్దమైన జగన్ కు ఊహించని,  కాదు కాదు  ఆశించని ఉత్పాతం  ఎదురయింది. అలా అనుకుంటాం గాని కడదాకా మనల్ని వెంటాడేది ఒక్కటే.. గతం… దేవుడు చూసిన,చూడకపోయినా మనం చేసిన పనులు మనకి తెలియవా ఏంటి?

2004 లో ys అధికార పీఠం ఎక్కినపటినుంచి జగన్ ఆస్తుల చిట్టా ఎలా పెరిగిపోయిందో అందరికి తెలుసు.. అయితే రాజకీయ అవినీతి ఆయనతోనే మొదలుకాలేదు.. ఆయన తోటే అంతం కాదు… కానీ ys జమానాలో  అవినీతి సరికొత్త ఎత్తులకుకున్న చేరుకున్నది మాత్రం నిజం.. అవినీతి చేయడం నేతలకు, భరించడం ప్రజలకు అలవాటుగా మారిపోయిన సమాజంలో దాని గురించి ఎంత మాట్లాడుకుంటే మాత్రం ప్రయెజనం ఏంటి?
ys       అవినీతి విషయాన్ని పక్కన బెడితే ys మరణం తర్వాత జగన్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు మాత్రం తప్పటడుగులే… వయసు,అధికార దర్పం కొత్తగా చూడటం, అంతులేని సంపద.. చుట్టూ మంది మాగధనలు.. ఇవన్నీ ఆయన్ను కుదురుగా ఉండనీయలేదు.. కేవలం భావోద్వేగాల   ఒరవడి లో కొట్టుకెళ్ళి..అధికారం మార్పిడి రాజరిక వ్యవస్థలో లాగా జరగాలని భావించారు.అదికూడా కాకలు తీరిన కాంగ్రెస్ పార్టీలో..సాధ్యమా? ప్రధానిగా పని చేసిన p. V. నరసింహారావు లాంటి రాజనీతజ్ఞులే ఆకాంగ్రెస్ వలలో చిక్కుకొని అల్లాడి పోయారు. అంత దాకా ఎందుకు? మీ తండ్రి మాటేమిటి? ప్రజా క్షేత్రంలో నిండుగా బలం, అభిమానం ఉన్నపటికీ అధికార పీఠం అందుకోవడానికి ఆయనకు సుమారు రెండున్నర దశాబ్దాలు పట్టిందిగా .

ir     “ఆవేశం  తగ్గించుకుంటే మీరు మంచి రాజకీయ నేత అవుతారు” ఇది 1984 లో pcc అధికార పగ్గాలు అప్పజెప్తూ  ysr కు నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేసిన హితవు…రాజీవుగాంధీ కూడా తన తల్లి మాటల్ని ys కు గుర్తుచేసిన సందర్భాలు ఉన్నాయంటారు.. అందులో నిజానిజాలెలావున్నా మీ ‘తండ్రికి’ చెప్పిన సూక్తులు మీకు వర్తించవా… కానీ మీరు అపుడు వీటిని వినే పరిస్థితిలో లేరు… గుర్తించుకునే  పరిస్తితిలో…ఆచరించే వైఖరిలో లేరు..

ysr-samadi         ఒక్కసారి ఆలోచించండి.. తండ్రి అంత్యక్రియల తర్వాత జగన్ సంయమనం పాటించివుంటే పరిస్థితి మరోలా  ఉండేదేమో.. తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న వేళ.. రోశయ్య తరువాత.. జగన్ కు పగ్గాలు దక్కేవేమో.! అలా జరుగుతుందని కచ్చితంగా చెప్పలేకపోయినా.. జరిగే అవకాశాలు కూడా తక్కువేమీ కాదు… అపుడు సంయమనం పాటించి వుంటే పరిస్థితులు ఇంత కఠినంగా మాత్రం మారేవి కాదు… వెనుక ఓ  జాతీయ పార్టీ అండ ఉండేది… పైగా ఇపుడు నిత్యం ఇబ్బంది పెడుతున్న ఈ అవినీతి కేసులు ఉండేవి కాదు.. ఉన్నా..  ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టేవేకావు.. జగన్ కు 2004  నుంచి 2009 దాకా అధికారం అండ.. ఆస్తులు.. అన్నీ సమకూరినా.. తర్వాత పరిస్థితి ఏంటి .? చేతికి దొరికిన వాటిని తనివితీరా అనుభవించే పరిస్థితి ఉందా..?

Jagan_Reddy         సరే ఆ సంగతి అలా ఉంచి  ప్రస్తుత రాజకీయాల సంగతి చూద్దాం … 2014 ఎన్నికల్లో ఓడిపోయాక.. కేవలం 5 లక్షల ఓట్ల తేడా అన్న మాట పట్టుకొని జగన్ అండ్ కో ఊరేగారు.. అంతకముందు ఉప ఎన్నికలు జరిగినపుడు టిడిపి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అంతలోనే ఎంత మార్పు.? అలా ఎందుకు జరిగింది.?ఆ దృష్టి కోణం నుంచి ఎప్పుడైనా ఆలోచించారా.?లేదే ..! అనుకుంటే 5 నిమిషాలలో ఈ సర్కార్ కూలిపోతుందన్న సవాల్ తో పరిస్థితి ఎలా మారిందో చూశారుగా ..?సరే జరిగిందేదో జరిగింది.. ప్రతిపక్ష పాత్రలో ఎక్కడ వ్యూహ చతురత..? ప్రభుత్వ వైపల్యాల మీదకన్నా చంద్రబాబు, లోకేష్ అవినీతి గురించే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు… 2009 లో జగన్ అవినీతి అని చంద్రబాబు ఎంత చెప్పినా జనం పట్టించుకోలేదు.. 2014 లో కూడా కొత్త రాష్ట్రం.. అనుభవం పనికొస్తుందేమో అన్న ఆలోచనే చంద్రబాబు గెలుపుకు దారితీసింది. ఇవన్నీ ఆలోచించుకోకుండా  అవినీతిపై  యుద్ధం చేస్తానంటే.. అది కూడా మీరు చేస్తానంటే  ఎలా వుంటుంది.?

Congress-BJP-         చూస్తుంటే పరిస్థితులన్నీ జగన్ కు క్లిష్టంగానే కన్పిస్తున్నాయి.. BJP అండ దొరికే పరిస్థితి కానరావడం లేదు.. కాంగ్రెస్ వైఖరిలో మార్పు కన్పిస్తున్నా.. జాతీయ  స్థాయిలో ఆ పార్టీ పరిస్థితి ఆశా జనకం గా లేదు. ఇక రాష్ట్రం లో చంద్రబాబు సర్కార్ వైపల్యాలు కనిపిస్తున్నా జనంలో జగన్ గ్రాఫ్ పెరగడం లేదన్నది సత్యం… గతం జగన్ ను వెంటాడుతోంది.. ఆ గతాన్ని తెరిచి చూస్తే  తప్పులు… ఒప్పులే కాదు… పాఠాలు,  అనుభవాలు కూడా కన్పిస్తాయి.. వాటి నుంచి ఎంత నేర్చుకోవచ్చు.. అయితే నేర్చుకున్న పాఠాలే పరీక్షలో  వస్తాయన్న గ్యారంటీ లేదు.. కానీ స్వీయశోధనతో నేర్చుకున్న పాఠాలు , గుణ పాఠాలు జీవితానికి బాగానే పనికొస్తాయి.. వాటిని రాజకీయాలకు  అన్వయిస్తే ఎంతో కొంత మేలు జరగొచ్చు.. ఏదేమైనా ఏదో అద్భుతం జరగాలి .. కాలం మారాలి.. లేదా దాన్ని మార్చే టైమ్ మిషన్ జగన్ కు కావాలి..

janJagan Home in Lotuspand..
ja b
Jagan Bungalaw in Bengaluru..
sakshi-Saakshi Tv Office In Hyderabad.

Leave a Reply