రివర్స్ లో హిట్లర్ ప్లాన్ …జగన్ కి నో యూజ్

Posted March 21, 2017

jagan want to apply hitler plan in kadapa mlc elections
శత్రువుల్ని బోల్తా కొట్టించడానికి హిట్లర్ ఓ గమ్మత్తు వ్యవహారం నడిపేవాడు.సేమ్ టు సేమ్ తన లాగే వుండే కొందరిని గుర్తించి భద్రతా సమస్యలు వున్నచోటుకి ప్రభుత్వ,ఇతరత్రా కార్యక్రమాలకి వారిని పంపేవాడు.అంతా వాళ్ళని హిట్లర్ గా భావించి మర్యాద చేస్తున్న విషయాలు తెలుసుకుని సరదాపడేవాడు.ఇక శత్రువులు తనని ఏ మాత్రం గుర్తించలేరని సంబరపడిపోయేవాడు.కొన్ని సందర్భాల్లో తన ఆహ్వానం మీదట వచ్చిన వారి ముందుకు కూడా డూప్లికేట్ ని పంపి హిట్లర్ వినోదం చూసే వాడు.అయినా ఎన్ని చేసినా ఏమి చేసినా జరగాల్సిందే జరిగింది.ఈ డూప్లికేట్ వ్యవహారాల్ని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రై చేసిన వైసీపీ అధినేత జగన్ కి దిమ్మతిరిగే రిజల్ట్ వచ్చింది.

హిట్లర్ తన డూప్లికేట్ ని పావుగా వాడుకుంటే కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థి డూప్లికేట్ ని వాడుకోడానికి జగన్ ప్రయత్నించారు. అప్పటిలా రూపాలు మార్చలేదుగానీ బీటెక్ రవిగా అందరికీ సుపరిచితుడైన టీడీపీ అభ్యర్థి అసలు పేరు రవీంద్రనాధ్ రెడ్డి.ఆ పేరునే ఓ ఆయుధంగా మలుచుకోవాలని జగన్ ఎత్తులు వేసాడు.అదే పేరు కల కొందరిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దించాడు.ఒకే పేరుతో ఎక్కువ అభ్యర్థులు ఉంటే ఓటర్ తికమక పడతాడని,తద్వారా లబ్ది పొందొచ్చని ప్లాన్ చేశారు.కానీ ఈ వ్యూహాన్ని టీడీపీ నేతలు ముందుగానే పసిగట్టి ఓటర్లు ఏ మాత్రం ఇబ్బందిపడకుండా వ్యూహ రచన చేశారు.దీంతో జగన్ ఆశలు ఆవిరయ్యాయి.

SHARE