గుంటూరు వైసీపీ లో బుర్రిపాలెం అలజడి?

Posted [relativedate]

jagan want to giving guntur seat adi seshagiri rao balasouri and rattayya shocked
గుంటూరు లోక్ సభ స్థానం నుంచి ఎందరో మహానుభావులు పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహించారు.టీడీపీ ఆవిర్భావం తర్వాత అక్కడి రాజకీయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి.ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే …గడిచిన 25 ,30 సంవత్సరాల్లో గుంటూరు నుంచి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడుతున్న పార్టీ అభ్యర్థులే ఎక్కువగా గెలుస్తున్నారు.ఈ సెంటి మెంట్ తోటే ప్రధాన రాజకీయ పక్షాలు గుంటూరు మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ కూడా గుంటూరు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.ఎలాగైనా ఆ స్థానంలో గెలవాలని గట్టి పట్టుదలతో వున్నారు. అందుకే బుర్రిపాలెం వాసి,సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు అభ్యర్థిత్వాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారు.ఈ పరిణామం అదే స్థానం కోసం ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న ఇద్దరిలో కలవరం రేపుతోంది.

కిందటి ఎన్నికల్లో గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీపడి ఓడిపోయిన బాలసౌరి ఈ సారి కూడా అదే స్థానం నుంచి పోటీకి ఆసక్తిగా వున్నారు.అయితే ఆ స్థానంలో కమ్మ అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలని వైసీపీ ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆయనకి నిరాశ తప్పేట్టు లేదు.అయితే కమ్మ కి టికెట్ దొరుకుతుందని భావించిన విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య కి ఆదిశేషగిరిరావు పేరు బయటికి రావడం చిరాకు తెప్పిస్తోంది. లక్ష్మి పార్వతి నేతృత్వంలోని ఎన్టీఆర్ టీడీపీ తరపున బాపట్ల లోక్ సభకి పోటీ చేసినప్పటినుంచి రత్తయ్య రాజకీయ వ్యవహారశైలిని పరిశీలిస్తే ఓ విషయం అర్ధమవుతుంది.ఆయన రాజకీయ అభిప్రాయాలు ఏమైనా కేవలం ఎన్నికల టైం లో ఏదో పార్టీని ఆశ్రయిస్తారు,ఏదో టికెట్ ఆశిస్తారు.ఈ వ్యవహారశైలితో ఆయన రాజకీయాల్లో రాణించలేకపోయారు. 2004 లో ఆయన బాపట్ల కాంగ్రెస్ టికెట్ కాదనుకోవడంతోటే పురందేశ్వరి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం చాలా మందికి తెలిసిన విషయమే.2014 ఎన్నికల టైం లో ఆయన వైసీపీ కి జై కొట్టినా టికెట్ రాలేదు.అయితే అంతకుముందులా కాకుండా ఈసారి పార్టీ కోసం ఎంతోకొంత శ్రద్ధ పెట్టారు.అందువల్లే రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు.అయితే ఒక్క సారిగా ఆదిశేషగిరిరావు పేరుకి ప్రాధాన్యం ఏర్పడడం రత్తయ్య కోటరీలో ఆందోళన రేకెత్తిస్తోంది.ఏదేమైనా తాను సైలెంట్ గా ఉంటూనే గుంటూరు వైసీపీ లో అలజడి రేపాడు బుర్రిపాలెం బుల్లోడు.

Leave a Reply