పవన్ బాలుడు..బాబు గోపాలుడు ..జగన్ డౌట్ ?

jagann
పవన్ తిరుపతి సభని విశ్లేషించుకున్నాక వైసీపీ అధినేత జగన్ ఓ అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది.పవన్ వెనుక ఉండి బాబే ఈ నాటకం ఆడిస్తున్నాడని అయన భావిస్తున్నాడట.పవన్ బాలుడైతే ఆయన్ని ఆడిస్తున్న గోపాలుడు బాబేనని జగన్ సన్నిహితులు వ్యక్తం చేసిన భావాలతో అయన కూడా ఏకీభవించారట.ఇలా భావించడానికి వైసీపీ నుంచి వినిపిస్తున్న వాదనలివే..

2009 లో ప్రజారాజ్యం రాకతో విజయం ముంగిట టీడీపీ కాలుజారిపడింది.కాంగ్రెస్ కనాకష్టంగా గెలవగలిగింది.పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతని దారి మళ్లించడానికే బాబు అదే వ్యూహంతో పవన్ జనసేనను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ అనుమానం.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అధికార పక్షం లాభపడుతుంది.అందుకే ఇప్పుడు ఆంధ్రప్రజలకి సెంటిమెంట్ గా మారిన ప్రత్యేకహోదా అంశాన్ని బాబు తెలివిగా తన వైపు లాక్కున్నారని ,అయితే అధికారంలో వుంటూ దీర్ఘకాలికంగా కేంద్రంతో పోరాటం సాధ్యం కాదని తెలిసి పవన్ ని ముందుకు తెచ్చారని జగన్ డౌట్ పడుతున్నారు.

ఆలా చేయడం వల్ల రెండు విషయాల్లో బాబు సక్సెస్ అయినట్టే అని వైసీపీ ఆందోళన చెందుతోంది.అందులో మొదటిది …పవన్ రంగంలో దిగాక హోదా పోరు క్రెడిట్ వైసీపీకి దక్కేది నామమాత్రమే.ఇక రెండోది ముద్రగడ నేతృత్వంలో తాము రగిలిస్తున్న కాపు రిజర్వేషన్ ఉద్యమం పలచబడడమో లేక అదికూడా పవన్ చేతిలోకో వెళుతుందేమో…ఈ రెండు కోణాల్లో వైసీపీ వ్యూహకర్తలు ఆలోచించి బాబు ప్లానింగ్ వల్లే ఇలా జరుగుతోందనుకుంటున్నారట.

మరోవైపు పవన్ సభ వెనుక బీజేపీ ఉందని తెలుగుదేశం భావిస్తోందని మరో టాక్.ఏదేమైనా ఎన్నికలు మరో రెండున్నరేళ్లు ఉండగానే ఏపీ లో రాజకీయ వేడి మొదలయింది .ఈ మొత్తం వ్యవహారానికి కేంద్రబిందువైన పవన్ వెనుక ఎవరున్నారో ఆయనకి ..ఆ వెనుక వున్నవారికి తెలుసు..అదిప్పుడు బయట పడకపోయినా భవిష్యత్ నడవడిక ఆ రహస్యాల్ని బట్టబయలు చేస్తుంది.వైసీపీ కూడా పవన్ బాలుడు ..బాబు గోపాలుడు అని ఫీల్ అవ్వకుండా మరో మంచి ప్లాన్ సిద్ధం చేసుకోవాల్సిందే ..రాజకీయాల్లో ఇదంతా సర్వసాధారణం కూడా ..
P

Leave a Reply