Posted [relativedate]
ఏపీలో రాజకీయ ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న వైసీపీ .. అధికారమే లక్ష్యంగా కొత్త ఎత్తులకు తెర తీసింది. పార్టీని నడపడం కంటే దానివెనక మంచి ప్లానింగ్ ఉండాలని భావిస్తున్నారు జగన్. ఈసారి ఎన్నికల్లో వైసీపీకి మంచి వ్యూహకర్త అవసరమని గట్టిగా నమ్ముతున్నారయన. అందుకోసం ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త అయితే బావుంటుందని జగన్ సన్నిహితులు సూచించారట. ప్రశాంత్ కిషోర్ లాంటి వారే ఎందుకు? ఏకంగా ఆయన్నే తీసుకొస్తే పోలా ? అని జగన్ ఆలోచించారట. అనుకున్నదే తడవుగా ఇప్పటికే ప్రశాంత్ తో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం. అతని దగ్గర్నుంచి కూడా దాదాపుగా సానుకూల సంకేతాలొచ్చాయని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇటీవలి పార్టీ ఎన్నికల్లో జగనే ప్రస్తావించారట.
ఇంతకీ ఎవరీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ? ఆయ స్పెషాలింటీ ఏంటి? అంతగా ఆయనలో ఏముందో తెలుసుకోవాలంటే… మోడీ దగ్గర్నుంచి స్టార్ట్ చేయాలి. ప్రశాంత్ కిషోర్ మొదట గుజరాత్ లో ఆయనకు వ్యూహకర్తగా పనిచేశారు. ప్రశాంత్ ఇచ్చిన సలహాల వల్లే ఆయన గుజరాత్ లో మళ్లీ అధికారంలోకి వచ్చారు. అంతేకాదు బీజేపీలో జాతీయనేతగా ఫోకస్ కావడంలోనూ ప్రశాంత్ దే కీరోల్ అని చెబుతారు చాలామంది కమలనాథులు. కానీ ఆ తర్వాత మోడీ ..ఆయనకు ఇంపార్టెన్స్ తగ్గించేశారు. ఆ తర్వాత ప్రశాంత్ ను బీహార్ సీఎం నితీశ్ కుమార్ దగ్గరకు తీశారు. బీహార్ ఎన్నికల్లో అతను స్ట్రాటజీతోనే నితీశ్ ఘనవిజయం సాధించారు కూడా. ఆ ఫేమ్ తో కాంగ్రెస్ కు దగ్గరయ్యారు ప్రశాంత్ కిశోర్. ఇప్పుడు యూపీ ఎలక్షన్స్ లో ఆయనదే వ్యూహరచన. యూపీ తర్వాత ప్రశాంత్ ను డైరెక్టుగా ఏపీకి తీసుకొచ్చేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.
ప్రశాంత్ ఎక్కడికి వెళ్లినా సక్సెస్ అయ్యారు. ఆ ఫార్ములానే వైసీపీకి కలిసి రావొచ్చని జగన్ అంచనా. అందుకే చంద్రబాబు లాంటి రాజకీయ ఉద్దండుడిని తట్టుకోవడానికి అతనైతేనే బెటరని వైసీపీ అధినేత గట్టిగా ఫిక్సయిపోరాట. ఆదిశగానే ప్రశాంత్ లాంటి వ్యూహకర్తను ఏపీకి తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.