జగన్మాయ ..ఆ స్వామి హోదా ఇప్పిస్తాడా?

  jagnmaaya. that swamy giving special status
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర … ఆధ్యాత్మిక కార్యక్రమాలు,ప్రవచనాల కన్నా వివాదాస్పద అంశాలపైనే అయన గళం ఎక్కువగా వినిపిస్తుంటుంది.అది కూడా ఈ రెండేళ్లలో మరీ ఎక్కువైంది .చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన ముహూర్తం దగ్గర్నుంచి ..పట్టిసీమ నుంచి కృష్ణకు గోదావరి జలాలు తరలించే దాకా..ప్రతి అంశం ఆయనకు ఆయుధమే.ప్రభుత్వం చేసే పనిని తప్పు పట్టడంలో ఏ తప్పు లేకపోవచ్చు.కానీ చేసే యుద్ధం లో డాలు కింద మతాన్ని,విశ్వాసాల్ని అడ్డుపెట్టుకోవడం ఏంటి?ప్రతి విషయానికి అలా చేస్తే అరిష్టం అంటూ జనాన్ని బెదరగొట్టడం ఏంటి?ఈ స్వామిగారు ఇటీవల పట్టిసీమ వ్యవహారంలో అయన రాసిన ఓ లేఖ రైతులకు మంటెక్కించింది.గోదావరి జలాల్ని తరలిస్తే కృష్ణా పుష్కర పవిత్రత పోతుందని అయన తెగ భాధపడిపోయారు.

అలాంటి స్వామి ఇప్పుడు ఓ మహత్కార్యం తలపెట్టారు.ఆంధ్రకు ప్రత్యేక హోదా రావాలని కోరుతూ రిషీకేశ్ లో ప్రత్యేక పూజలు చేస్తున్నారట. ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి అక్కడకు వెళ్లి ఆ పూజల్లో పాల్గొని హోదా గురించి ప్రార్ధించి స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు.నిన్నటి నుంచి మీడియా కి ఈ విషయం చేరవేయడానికి బాగానే కష్టపడ్డారు.అయితే నిన్నటికి ముందు స్వామి వారి ప్రత్యేక హోదా పూజ గురించి ఎక్కడా విన్న దాఖలాలు లేవు.సరే ప్రచారం కల్పించటం ఇష్టం లేదనుకుంటే తాజా లీకుల అవసరం కూడా లేదుగా .ఈ పూజలు ,పర్యటనలు ,ఆశీస్సులు వెనుక రహస్యం ఉందని అందులో భాగస్వాములైన వాళ్ళు అనుకుంటున్నారేమో గానీ జనానికి అన్నీ అర్ధం అవుతున్నాయి.

SHARE