60 యేళ్ల వృద్ధుడిగా జగ్గూభాయ్….

Posted October 14, 2016

   jagapathi babu acting 60 years old man character
టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోగా ఏమాత్రం లోటు కనిపించిన మొహమాటం లేకుండా విలన్ గా టర్న్ తీసుకుంటున్నారు. ఈ దారిలో యంగ్ హీరోలు కూడా నడుస్తున్నారు.అయితే, ఈ ట్రెండ్ ని క్రియేట్ చేసిన ఘనత మాత్రం జగపతి బాబుదే.హీరోగా త‌న కెరీర్‌కు శుభం కార్డు ప‌డిపోయింద‌ని గ్ర‌హించిన‌ జ‌గ‌ప‌తిబాబు.. ‘లెజెండ్‌’తో విల‌న్‌గా ట‌ర్న్ తీసుకొన్నాడు.

విలన్ గా టర్న్ తీసుకొన్న తర్వాత జగ్గూభాయ్ బిజీ అయిపోయాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో జగ్గూభాయ్ ని విలన్ గా తీసుకుంటున్నారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాగ్వార్’ లో అదరగొట్టాడు జగ్గుభాయ్. ఇప్పుడిదే బ్యానర్ లో ఆయన హీరోగా ఓ చిత్రం
తెరకెక్కనుంది. ఇందులో 60యేళ్ల వృద్దుడిగా కనిపించబోతున్నాడు ఈ  ట్రెండీ విలన్.

ఈ విషయాన్ని స్వయంగా జగపతి బాబునే తెలిపారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్, చెన్నాంభిక ఫిలింస్ సంయుక్తంగా ఓ సినిమాని తెరకెక్కించనుంది. ఇందులో 60
ఏళ్ల వృద్ధుడిగా కనిపించబోతున్నా.. ఇది చాలా వైలెంట్ పాత్ర… ప్రస్తుతం స్కిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు.

SHARE